Tag Archives: Facilities tickets

రైల్వే టికెట్ కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

దాదాపు చాలామంది రైల్వే ప్రయాణం చేసే ఉంటారు. అయితే రైళ్లల్లో ప్రయాణించడానికి మాత్రమే టికెట్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. రైల్వే టికెట్ తీసుకునే క్రమంలో టికెట్ ధర కన్నా మనం 45 పైసలు అదనంగా చెల్లిస్తాం.

ఆఫ్ లైన్ లో తీసుకుంటే అది మనకు కనిపించదు. ఇంటర్ నల్ గా ఉంటుంది. కానీ మనం ఆన్ లైన్ రైలు టికెట్ బుక్ చేస్తే మాత్రం మనకు అది తెలుస్తుంది. టికెట్ బుక్ చేసే సమయంలో ఇన్సురెన్స్ తీసుకుంటారా అంటూ అడుగుతుంది. దానిని క్లిక్ చేయడమే మంచింది. ఎందుకంటే.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సురెన్స్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మనిషి చనిపోతే రూ.10 లక్షలు, అంగవైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు వస్తాయి. చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చేరితే ఖర్చులకు రూ.2లక్షల వరకు క్లయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్లాక్ రూమ్ సౌకర్యం, రెస్ట్ రూమ్, లాకర్ ఫెసిలిటీ వంటి సదుపాయాలు కూడా పొందవచ్చు.

ప్రతి ఒక్క రైల్వే ప్రయాణికుడికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ టికెట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక వేళ మనం జర్నీ చేసే సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురయితే.. టీటీఈని అడిగి పస్ట్ ఎయిడ్ కిట్ ను కూడా తీసుకోవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. టికెట్ అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే అనుకుంటారు. దీని వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి.