Tag Archives: failure in politics

AP Politics: రాజకీయాలలో జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ రానించక పోవడానికి అసలు కారణం అదేనా?

AP Politic: సాధారణంగా రాజకీయాలలోకి రావాలని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అయితే రాజకీయాల్లో రాణించడం అందరి తరం కాదు. ఇలా రాజకీయాలలోకి వచ్చి వ్యవస్థలోనే మార్పు చేయాలని కొంతమంది కంకణం కట్టుకుని రాజకీయాలలోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో జయప్రకాశ్ నారాయణ, జెడి లక్ష్మీనారాయణ ఒకరు. వీరిద్దరు ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడిన వారే.

జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ స్థాపించగా జేడీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ నుంచి పోటీ చేసే పరాజయం పొందిన అనంతరం ఈ పార్టీకి రాజీనామా చేశారు.అయితే ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న వీళ్ళు రాజకీయాలలో రాణించలేక పోవడానికి కారణం మీరు చదువుకున్న చదువు చేసే ఉద్యోగంలో నేర్చుకున్న విలువలే కారణమని చెప్పాలి.

రాజకీయాలలో అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేలా ఉంటుంది. ఈ రెండు వీరిద్దరికీ చేతకాదు. అవినీతి లేకుండా ముందుకు వెళ్లాలనే భావనలో ఉన్న వీరిద్దరు రాజకీయాలలో ఉండలేకపోయాడు. రాజకీయం అంటేనే అవినీతి.ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, ప్రజల సౌకర్యాలను తీరుస్తారో అలాంటి వారికి ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప ఎవరికి పట్టం కట్టాలి అనే విషయం గురించి ఆలోచించరు.

అవినీతి అజెండాగా ఉండటమే..


అలాగే రాజకీయాలలో ముందుకు సాగాలంటే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది. డబ్బు లేకపోతే రాజకీయాలలో ముందుకు సాగలేరు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి కూడా ఇదే. డబ్బు లేకుండా అవినీతి అజెండాగా ఉంటే పదవులు రావు. వెన్నుపోట్లు, ముందుపోట్లు పొడవగలిగితే, రాజకీయాలలో రాణిస్తారు. అయితే జయ ప్రకాష్ నారాయణ, జెడి లక్ష్మీనారాయణ విషయంలో వారు ఎంతో విలువలతో కూడి ఉండడం, డబ్బు లేకపోవడం, అవినీతి అజెండాగా ముందుకు సాగడమే వారిని రాజకీయాలలో వెనక్కు నెట్టుతుందని చెప్పాలి.