Tag Archives: Family Pension rules

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్.. రూల్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు దీనికి అర్హులు కానున్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందొచ్చు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది.

అయితే ఈ పెన్షన్ రూ. 45 వేలు వరకు మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దాని లిమిట్ ను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమనిబంధనల మేరకు గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చు.

ఈ మేరకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన కొత్త రూల్స్‌ తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. వీటికి డీఆర్ సమయానుగుణంగా జతవుతుంది. అలాగే నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జతవుతుంది.