Tag Archives: find mobile phone

మీ ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఏదో పనిలో నిమగ్నమై ఉండి మన ఫోన్ పోగొట్టుకోవడం సర్వసాధారణం. మరి కొన్ని సార్లు మన ఫోన్ దొంగలు కూడా దొంగలిస్తుంటారు. అయితే పోగొట్టుకున్న లేదా దొంగలు తీసుకెళ్లిన మన ఫోన్ ఎక్కడుందో? మనకి ఎంత దూరంలో ఉందో ఎంతో సులభంగా కనుక్కోవచ్చు. కేవలం ఫోన్ కనుక్కోవడం కాకుండా మన ఫోన్ లో ఉండే వాట్స్ యాప్ చాట్ ను కూడా తొలగించవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం..

మన ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో  How To Find Mobile Location అనేది టైప్ చేయాలి. తర్వాత మన సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా పోగొట్టుకున్న మన ఫోను ఎక్కడుందో సులభంగా కనిపెట్టవచ్చు. దీనికోసం ముందుగా మనం మెయిల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. మెయిల్ లో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ఆన్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది.

మన సెల్ ఫోన్ లో ఎంతో విలువైన సమాచారం, మెసేజ్ లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకొనే అవకాశం కూడా ఉంది.దీని కోసం నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా సిమ్ కార్డ్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ ఖాతాను డీ ఆక్టివేట్ చేయాలనుకుంటే కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.

మెయిల్‌లో ప్రధానంగా “Lost/Stolen: Please Deactivate My Account అని ఇచ్చి మొబైల్ నంబర్ ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మన ఫోన్ దొరికిన లేదా కొత్త ఫోన్ కొన్న 30 రోజుల్లో మన సిమ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పోగొట్టుకున్న మన ఫోను ఎంతో సులభంగా ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.