సాధారణంగా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఏదో పనిలో నిమగ్నమై ఉండి మన ఫోన్ పోగొట్టుకోవడం సర్వసాధారణం. మరి కొన్ని సార్లు మన ఫోన్ దొంగలు కూడా దొంగలిస్తుంటారు. అయితే పోగొట్టుకున్న లేదా దొంగలు తీసుకెళ్లిన మన ఫోన్ ఎక్కడుందో? మనకి ఎంత దూరంలో ఉందో ఎంతో సులభంగా కనుక్కోవచ్చు. కేవలం ఫోన్ కనుక్కోవడం కాకుండా మన ఫోన్ లో ఉండే వాట్స్ యాప్ చాట్ ను కూడా తొలగించవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం..
మన ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో How To Find Mobile Location అనేది టైప్ చేయాలి. తర్వాత మన సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా పోగొట్టుకున్న మన ఫోను ఎక్కడుందో సులభంగా కనిపెట్టవచ్చు. దీనికోసం ముందుగా మనం మెయిల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. మెయిల్ లో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ఆన్ చేయడం ద్వారా మన ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది.
మన సెల్ ఫోన్ లో ఎంతో విలువైన సమాచారం, మెసేజ్ లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకొనే అవకాశం కూడా ఉంది.దీని కోసం నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా సిమ్ కార్డ్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ ఖాతాను డీ ఆక్టివేట్ చేయాలనుకుంటే కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.
మెయిల్‌లో ప్రధానంగా “Lost/Stolen: Please Deactivate My Account అని ఇచ్చి మొబైల్ నంబర్ ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మన ఫోన్ దొరికిన లేదా కొత్త ఫోన్ కొన్న 30 రోజుల్లో మన సిమ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పోగొట్టుకున్న మన ఫోను ఎంతో సులభంగా ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…