సాధారణంగా మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం వెళ్ళినప్పుడు మనకు ఎంత కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకొని వస్తాము. కానీ వనపర్తి జిల్లాలో ఒక ఏటీఎంలో కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళినపుడు రూ.100 ఎంటర్ చేస్తే ఏటీఎం నుంచి రూ.500 వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెం.1 ఏటీఎంలో శనివారం ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లిన కస్టమర్లకు ఈ విచిత్ర సంఘటన ఎదురైంది 100 కొడితే 500 రావడంతో అక్కడి ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే మరింత డబ్బును డ్రా చేసుకోవడం కోసం కస్టమర్లు అక్కడి నుంచి వెళ్లకుండా మరిమరి డబ్బులను డ్రా చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా ఇంట్లో ఉన్న తమ వారికి ఫోన్ చేసి ఏటీఎంలను తెప్పించుకొని మరి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏటీఎం దగ్గర జన సమూహం పెరిగిపోయింది. ఇంతలోనే ఆ ప్రాంతంలోకి పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీస్ అధికారులు రావడంతో ఏటీఎం దగ్గర ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు.
పోలీసులకు అనుమానం వచ్చి విషయం ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు సంబంధిత ఏటీఎం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఏటీఎంలో ఉన్నటువంటి సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేశారు. అయితే ఈ ఏటీఎం నుంచి అదనంగా ఎంత డబ్బు డ్రా అయింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారనే విషయం గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…