ఆ ఏటీఎంలో రూ.100 కొడితే…రూ.500 వచ్చాయి.. ఎక్కడంటే!

0
184

సాధారణంగా మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం వెళ్ళినప్పుడు మనకు ఎంత కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకొని వస్తాము. కానీ వనపర్తి జిల్లాలో ఒక ఏటీఎంలో కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళినపుడు రూ.100 ఎంటర్ చేస్తే ఏటీఎం నుంచి రూ.500 వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెం.1 ఏటీఎంలో శనివారం ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లిన కస్టమర్లకు ఈ విచిత్ర సంఘటన ఎదురైంది 100 కొడితే 500 రావడంతో అక్కడి ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే మరింత డబ్బును డ్రా చేసుకోవడం కోసం కస్టమర్లు అక్కడి నుంచి వెళ్లకుండా మరిమరి డబ్బులను డ్రా చేస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా ఇంట్లో ఉన్న తమ వారికి ఫోన్ చేసి ఏటీఎంలను తెప్పించుకొని మరి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏటీఎం దగ్గర జన సమూహం పెరిగిపోయింది. ఇంతలోనే ఆ ప్రాంతంలోకి పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీస్ అధికారులు రావడంతో ఏటీఎం దగ్గర ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు.

పోలీసులకు అనుమానం వచ్చి విషయం ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు సంబంధిత ఏటీఎం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఏటీఎంలో ఉన్నటువంటి సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేశారు. అయితే ఈ ఏటీఎం నుంచి అదనంగా ఎంత డబ్బు డ్రా అయింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారనే విషయం గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.