Tag Archives: gas booking

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మిస్డ్ కాల్ తో గ్యాస్ బుకింగ్ చేసుకునే ఛాన్స్..?

గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లకు ఇండేన్ గ్యాస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ‘ 84549 55555 ’ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఇండేన్ గ్యాస్ కస్టమర్లు సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండేన్ గ్యాస్ కంపెనీ కొత్త సర్వీసులను ప్రవేశపెట్టడంతో గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది.

మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయడం ద్వారా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సులువుగా సిలిండర్ ను బుకింగ్ చేయవచ్చు. అదే సమయంలో ఎటువంటి కాల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. ఇండేన్ గ్యాస్ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివశించే వారికి, సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూరనుంది.

అయితే ప్రస్తుతం ఇండేన్ గ్యాస్ కస్టమర్లు మాత్రమే ఈ సర్వీసులను ఉపయోగించుకునే అవకాశం ఉండగా ఇతర గ్యాస్ కంపెనీలు సైతం త్వరలో ఈ సర్వీసులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండేన్ గ్యాస్ కంపెనీ భువనేశ్వర్ లో ఈ సర్వీసులను అమలు చేస్తుండగా త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నిన్న ఒక ప్రకటనలో భాగంగా ఇండేన్ గ్యాస్ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారుల సౌకర్యార్థం ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు ఇండేన్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది.

గ్యాస్ సిలిండర్ బుక్ చేసున్నారా… అమల్లోకి 4 కొత్త నిబంధనలు..?

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగానే నిబంధనల్లో సైతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ విషయంలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నూతన నిబంధనల గురించి తెలుసుకోని వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నేటి నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెబుతారో వాళ్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ ను పొందగలగుతారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అడ్రస్ మారినా గ్యాస్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మారినా వీలైనంత త్వరగా అప్ డేట్ చేయించుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే గ్యాస్ వినియోగదారులకు ఈ మేరకు సూచనలు చేస్తున్నాయి.

ఇండేన్ గ్యాస్ ను వినియోగించే వినియోగదారులకు బుకింగ్ నంబర్ మారింది. పాత బుకింగ్ నంబర్ కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే గ్యాస్ బుకింగ్ కాదు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7718955555 కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో గ్యాస్ బుకింగ్ కు ఒక్కో సర్కిల్ లో ఒక్కో నంబర్ ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ కు ఒకే నంబర్ ఉంది.

ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో తగ్గిందో తెలుసుకుంటే సిలిండర్ డెలివరీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు కలగవు.