Tag Archives: Gellu Srinivas

సీఎం కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ కృతజ్ఞతలు!

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నమ్మి అవకాశం ఇచ్చినందుకు సీఎంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేసిన అధికార పార్టీ.. రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెల్లు గెలుపు ఖాయం_ మంత్రి హరీష్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బిజెపి మధ్యే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో మంత్రి మాట్లాడారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీశ్ అన్నారు. ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరారన్నారు . నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం అని హరీశ్ పేర్కొన్నారు.

హుజరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీశ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మరో రెండేళ్లు ఉండేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని.. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ప్రజలంతా టిఆర్ఎస్ ని గెలిపించాలని హరీష్ కోరారు.

సీఎం కేసీఆర్ కు పాదాభివందనం _ గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకి అప్పజెప్పారని శ్రీనివాస్ పేర్కొన్నారు.

కాగా పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కెసిఆర్ గొప్ప అవకాశం కల్పించారని శ్రీనివాస్ తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపు_ మంత్రి తలసాని

హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

కాగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారాని అని ప్రశ్నించారు.