Tag Archives: ghmc

విషాదం.. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు కార్మికుల గల్లంతు.. ఒకరు మృతి

సాహెబ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్‌లోకి దిగి డ్రైనేజీ క్లీనింగ్‌కు చేస్తున్న సమయంలో ఇద్దరూ కార్మికులు గల్లంతయ్యారు. అంతయ్య, శివ అనే కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆగ్నీ మాపక సిబ్బంది ఒకరి మృతిదేహాన్ని వెలుపలికి తీశారు. మ్యాన్‌హోల్‌లో ఊపీరిరాడక అతను మృతి చెందినట్లు తెలుస్తోంది, గల్లంతైన మరో కార్మికుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు

మంత్రి కేటీఆర్ సహాయం కోరిన యాంకర్ రష్మి.. ఎందుకో తెలుసా?

బుల్లితెరపై యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న యాంకర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సహాయం కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యాంకర్ రష్మి జంతు ప్రేమికురాలన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మూగజీవాలకు ఏదైనా ఆపద వస్తే స్పందించడానికి ముందుగా ఉంటారు. కరోనా కారణం వల్ల లాక్ డౌన్ సమయంలో ఎన్నో జంతువులకు ఆహారం అందిస్తూ వాటిపై ప్రేమను వ్యక్త పరిచిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉన్నటువంటి శునకాలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటికి ఏ విధమైనటువంటి చికిత్స అందించకుండా రోడ్లపై వదులుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జంతువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు సరైన పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని.. అందుకు సహాయం చేయాలని రష్మి మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేస్తూ..కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు.

గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా
“సేవ్‌యానిమల్స్‌ఇండియా” అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్ ఈ విషయం చెబుతున్నారు. ఈ విధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత కుక్కలను రోడ్లపై వదలడంతో ఫోటోలతో సహా ఆ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 2,122 కుక్కలకు ఆపరేషన్ చేసే రోడ్లపై మొదలుపెట్టినట్లు సదరు నెటిజన్ పేర్కొనడంతో ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కిట్వీట్ చేస్తూ అతని సహాయం కోరింది. మరి మంత్రి గారు రష్మీ విజ్ఞప్తిపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.