బుల్లితెరపై యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న యాంకర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సహాయం కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాంకర్ రష్మి జంతు ప్రేమికురాలన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మూగజీవాలకు ఏదైనా ఆపద వస్తే స్పందించడానికి ముందుగా ఉంటారు. కరోనా కారణం వల్ల లాక్ డౌన్ సమయంలో ఎన్నో జంతువులకు ఆహారం అందిస్తూ వాటిపై ప్రేమను వ్యక్త పరిచిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉన్నటువంటి శునకాలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటికి ఏ విధమైనటువంటి చికిత్స అందించకుండా రోడ్లపై వదులుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జంతువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు సరైన పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని.. అందుకు సహాయం చేయాలని రష్మి మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేస్తూ..కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.
గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా
“సేవ్‌యానిమల్స్‌ఇండియా” అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ ఈ విషయం చెబుతున్నారు. ఈ విధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత కుక్కలను రోడ్లపై వదలడంతో ఫోటోలతో సహా ఆ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 2,122 కుక్కలకు ఆపరేషన్ చేసే రోడ్లపై మొదలుపెట్టినట్లు సదరు నెటిజన్ పేర్కొనడంతో ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కిట్వీట్ చేస్తూ అతని సహాయం కోరింది. మరి మంత్రి గారు రష్మీ విజ్ఞప్తిపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…