Featured

సుకుమార్ ని “నువ్వు డైరెక్టరా అంటే ఏం చేస్తావ్..” అని అడిగిందెవరో తెలుసా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లెక్కల మాస్టారుగా పేరున్న దర్శకుడు సుకుమార్. స్టార్ డైరెక్టర్ గా ఆయనకి ఇప్పుడున్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. రైటర్, డైరెక్టర్ గా, ఇప్పుడు నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారరు. దిల్ రాజు కంపెనీ నుంచి వచ్చి స్టార్ డైరెక్టర్ గా సెటిలయిన వాళ్ళలో సుకుమార్ ఒకరు. సుకుమార్ సొంతూరు తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలోని అడ్డతీగల మండలంలోని మట్టపాడు. చిన్నప్పటి నుంచే పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. ఎంతగా అంటే ఆ గ్రామంలో ఉన్న ఓ గ్రంథాలయంలోని పుస్తకాలు 90 శాతం చదివాడు. దాంతో ఆయనకి రాయాలనే ఆసక్తి పెరింది. దాంతో పాఠశాలలో ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, కవితలు రాయడం మొదలు పెట్టారు.

ఇక సుకుమార్ ది మ్యాథస్ బ్యాక్ గ్రౌండ్. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరం వెళ్లినప్పటి నుంచి తన జూనియర్లకు మ్యాథ్స్ చెప్పేవారు. దాంతో ఆయనకి ట్యషన్స్ చెప్పే అవకాశం వచ్చింది. అలా పాకెట్ మనీ కోసం చదువుకుంటూనే రాజోలులో ట్యూషన్లు చెప్తూ డబ్బు సంపాదించేవాడు. ఈ క్రమంలోనే 1998లో కాకినాడ ప్రాంతంలోని ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరారు. అప్పుడే సుకుమార్ నెలకి 75 వేలు సంపాదించారు. ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కుకున్నప్పటికీ ఆయన మనసు మాత్రం సినిమాల మీదనే ఉండేది.

దాంతో సుకుమార్ 2000 సంవత్సరంలో అమ్మా, నాన్నలను ఒప్పించి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేసే అవకాశం పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వద్ద చేరి కొన్ని సినిమాలకి రచనా, దర్శకత్వ విభాగాలలో పనిచేశారు. అలా దిల్ రాజుతో మంచి బాండింగ్ ఏర్పడింది. కథ రెడీ చేసుకో సినిమా చేద్దామని దిల్ రాజు ఆఫర్ ఇవ్వడంతో సుకుమార్ ఆర్య కథ సిద్దం చేసుకున్నాడు. ఈ కథ ముందు మన డార్లింగ్ ప్రభాస్ కి చెప్పాడు సుకుమార్.

అయితే ఆర్య కథ విన్న ప్రభాస్ .. ఈ కథ నా కంటే అల్లు అర్జున్ కి చాలా బావుంటుందని సలహా ఇచ్చాడు. దాంతో వెళ్ళి అల్లు అర్జున్ అల్లు అరవింద్ కి ఆర్య కథ చెప్పారు సుకుమార్ – దిల్ రాజు. ఇద్దరికి ఆర్య కథ బాగా నచ్చడంతో 2004లో అల్లు అర్జున్ హీరోగా ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నిర్మాత దిల్ రాజుకి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అలా కెరీర్ లో మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్ రామ్ పోతినేని తో జగడం, ఆర్య 2 సినిమాలు చేశాడు. కానీ ఈ రెండు అంత హిట్ సాధించలేదు. అయితే 4వ చిత్రంగా సుకుమార్ నుంచి వచ్చిన 100% లవ్ భారీ హిట్ గా నిలిచింది.

ఇక 2014 లో మహేష్ బాబు తో 1 – నేనొక్కడినే సినిమా ఫ్లాపవగా, 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018లో రాం చరణ్ తేజ్ తో తీసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలాంటి స్టార్ డైరెక్టర్ ని..  నువ్వు డైరెక్టర్ ఆ అంటే ఏం చేస్తావ్.. అని తన భార్యే అడిగింది. ఆమెకి సినిమాల మీద అవగాహన లేదట. దాంతో డైరెక్టర్ అంటే ఏం పని చేస్తావని క్వశ్చన్ చేసిందట. సుకుమార్ ది ప్రేమ వివాహం. అయితే ఆమెకి దర్శకుడు ఏం చేస్తాడో చెప్పే క్రమంలోనే పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు సుకుమార్. వన్ ఫ్లాపయినప్పుడు సుకుమార్ బాధపడుతుంటే అమెరికాలో మ్యాథ్స్ చెప్తే నెలకి లక్ష ఇస్తారట వెళదామా అని అడిగిందట. ఇక కుమారి 21 ఎఫ్ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిందని సుకుమార్ చెప్పుకొచ్చాడు. కాగా సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ తో పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమా తీస్తున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago