ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలం నుంచి వేణు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా తర్వాత వేణు ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. తాజాగా ఫ్యామిలీ హీరో వేణు మాస్ మహారాజా రవితేజ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ హీరోగా, శరత్ కుమార్ మండవ దర్శకత్వంలో,
సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే డ్యూటీ లో ఉన్నటువంటి రామారావు కోసం మరొక హీరో డ్యూటీలో చేరుతున్నారు అంటూ చిత్ర బృందం తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఇందులో కథానాయికలుగా మజిలి ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన 68వ సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నారు. శరత్ కుమార్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతాన్ని సామ్ సిఎస్ అందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…