Categories: FeaturedHealth News

మిరియాలతో శరీర బరువు తగ్గవచ్చు… ఎలాగో తెలుసా?

ప్రస్తుత కాలంలో మన రోజువారీ ఆహార విషయంలో భాగంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి వస్తున్నాయి. ప్రస్తుతం పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలు మన వంటింట్లోనే దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.శరీర బరువును తగ్గించుకోవడం నుంచి వివిధ రకాల సమస్యలను మన ఇంట్లో లభించే ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఆ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

ఈ క్రమంలోనే ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా విరివిగా ఉపయోగిస్తున్న వాటిలో మిరియాలు ఒకటి.మిరియాలలో ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దాగి ఉన్నాయి.ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా మిరియాలను తీసుకోవటంవల్ల జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.మరి శరీర బరువును తగ్గించుకోవడం కోసం మిరియాలు ఏవిధంగా దోహదపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

అధిక శరీర బరువుతో బాధపడేవారు తరచూ నాలుగైదు మిరియాలను తమలపాకులో పెట్టుకుని నమిలి మింగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అదే విధంగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె, ఒక టేబుల్ స్పూన్ మిరియాలపొడి కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.

మిరియాలపొడి తినలేము అని భావించేవారు మార్కెట్లో లభించే పెప్పెర్ ఆయిల్ ఉపయోగించవచ్చు.ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలోకి రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకొని తాగినా కూడా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.అదే విధంగా ఇతర సుగంధ ద్రవ్యాలు అయినా అల్లం ,పుదీనా, లవంగాలు తులసి ఆకులతో కలిపి కషాయం తయారుచేసుకొని ,తాగినా కూడా తొందరగా శరీర బరువును తగ్గించుకోవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago