Featured

మన స్టార్స్ తెర చాటు ప్రేమకథలు, సక్సెస్ అయినవి కొన్ని, ఫెయిల్ అయినవి కొన్ని..

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య అఫైర్స్ బాగా వినిపిస్తుంటాయి. రెండు, మూడు సినిమాలు కలిసి నటిస్తే వారిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అని పుకార్లు పుట్టిస్తుంటారు.

ఇదంతా సాధారణ విషయమే అయితే కొన్ని రూమర్లు పెళ్లి వరకు వెళితే మరికొన్ని మధ్యలోనే తెగిపోయాయి. మరి కొన్ని సహజీవనం సాగించే వరకు నడిచాయి. అలా ఇండస్ట్రీలో బాగా వినిపించిన కొన్ని అఫైర్స్ ఇప్పుడు చూద్దాం.

1) శృతి హాసన్ & మైకేల్ కోర్సెల్

లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ తో శృతి చాలారోజులుగా డేటింగ్ చేసింది. శృతి హాసన్ కి సంబందించిన చాలా ఈవెంట్స్ లో మైకేల్ కనిపించేవాడు. ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలుసు, కానీ శృతి మాత్రం ఎప్పుడు ఈవిషయం గురించి ప్రస్తావించలేదు. ఆ తరువాత ఇద్దరూ బ్రేకప్ అయినట్టు వార్తలు వినిపించాయి.

2) సమంత & సిద్దార్ద్

జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్ధ్ తో ప్రేమలో పడింది సమంత. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారు. కానీ వారి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ విషయంలో ఈ జంట మీడియా ముందు కూడా మాట్లాడింది. సమంత ఇప్పుడు అక్కినేని చైతన్యను పెళ్లి చేసుకుని హాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది.

3) త్రివిక్రమ్ & పార్వతి మెల్టన్

త్రివిక్రమ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ తో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. జల్సా సమయంలో త్రివిక్రమ్ ఆమెకు డైమండ్ నెక్లస్ గిఫ్టుగా ఇచ్చాడని అప్పట్లో గాసిప్. కానీ ఆ తరువాత వీరి మధ్య ఎలాంటి బంధం లేదని అది ఒట్టి గాసిప్ మాత్రమె అని తెలుస్తోంది.

4) రాణా & త్రిష


టాలీవుడ్ హీరో రాణా చాలారోజుల పాటు నటి త్రిషతో డేటింగ్ చేసాడని టాక్. వీరిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా అప్పట్లో బయటకి వచ్చాయి.

5) రిచా గంగోపాధ్యాయ & సుందర్ రామ్


ఒక తమిళ సినిమా సమయం లో వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. చాలా సన్నిహితంగా ఉండేవారు. సుందర్ రామ్ రిచాని పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నించాడు. సూసైడ్ కూడా చేసుకుంటా అని బెదిరించాడు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. కొన్నాళ్లకి ఆమె ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయింది.

6) పవన్ కళ్యాణ్ & అన్నా లెజినోవా


రష్యా కి చెందిన ఆమెతో పవన్ ప్రేమయనం సాగించాడు. అప్పటికే పవన్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తరువాత అయన భార్య రేణు దేశాయ్ కి విడాకులిచ్చి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు.

7) ఇలియానా & ఆండ్రు నిల్ బోన్


ఆస్ట్రేలియా కి చెందిన ఆండ్రు అనే ఫోటోగ్రాఫర్ తో ఇలియానా చాలా రోజులుగా డేటింగ్ చేసింది. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు జోరు మీద వినిపించాయి. అయితే ఏమయిందో తెలియదు కానీ కొద్దికాలానికి వీరిద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి.

8) ఆసిన్ & నిల్ నితిన్ ముఖేష్


మొదట్లో ఆసిన్ & నీల్ నితిన్ మంచి స్నేహితులు. కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది, మరికొన్నాళ్లు డేటింగ్ చేసారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.

9) హన్సిక & శింభు


చాలాకాలం పాటు రిలేషన్ సాగించిన వీరిద్దరూ సింబు మరియు హన్సిక జంట. ఆ తరువాత విడిపోయారు. ఇప్పుడు ఎవరికి వారు బిజీ అయిపోయారు.

10) వరుణ్ సందేశ్ & శ్రద్దా దాస్


వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు వెళ్లడం, టైం స్పెండ్ చేయడం తో వీరు ప్రేమలో ఉన్నారు అని వార్తలు వినిపించాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పేవారు. ఆ తరువాత వరుణ్ వితికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago