Movie News

ఎన్టీఆర్ ఆటలో చెర్రీ సందడి.. లీకైన ఎవరు మీలో కోటీశ్వరుడు.. చరణ్ ఎంత గెలుచుకున్నాడంటే?

బుల్లితెరపై అద్భుతమైన విజయంతో దూసుకుపోతున్న కార్యక్రమాలలో “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. మొదట్లో ఈ కార్యక్రమం హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ పేరుతో ప్రసారమయ్యేది.దీని ఆధారంగానే తెలుగులో ఇప్పటి వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ నాలుగు సీజన్లలో పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కొద్దిగా మార్పులు చేసి “ఎవరు మీలో కోటీశ్వరుడు?”ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే గత సీజన్లలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించగా..ఈ సారి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమం బుల్లితెరపై ప్రసారం కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం చేత ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లీక్ అయింది. మరి ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఎంత గెలుచుకున్నాడు అని విషయానికి వస్తే…

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ తనదైన శైలిలో ఆటలు ఆడి ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రామ్ చరణ్ గెలుచుకున్న పాతిక లక్షలను ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించారన్న వార్త వినబడుతోంది.అయితే ఎన్టీఆర్, చరణ్ కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ఆగస్టు 15 16 తేదీలలో ప్రసారం కానుందని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago