Featured

శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ చేతికి తాళ్ళు..ఉంగరాలు.. ఎందుకు పెట్టుకునేవారో తెలుసా ?

టాలీవుడ్ సినిమా ఇండాస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి వద్ద శిష్యరికం చేసిన అగ్ర దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల మీద ఆసక్తితో దాసరి వద్ద అసిస్టెంట్ గా చేరారు. ఆయన స్క్రిప్ట్ రాస్తుంటే ఆయనతో పాటు రాత్రంతా కూర్చుకొని దాసరి రాసిన సీన్స్ అన్నీ ఫెయిర్ చేస్తుండేవారు. అలా కథ స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేర్చుకున్నారు. ఇక ఆయనతో పాటు ఉంటూ దర్శకత్వ శాఖలో పనిచేశారు. దాసరి గారి శిష్యుడు అంటే తప్పకుండా మంచి టాలెంట్ ఉన్నవాడే అని ఇండస్ట్రీలో పేరుంటుంది. అలాంటి పేరు కోడి రామకృష్ణ సంపాదించుకున్నారు. అలా దర్శకుడు అవ్వాలనుకున్నప్పుడు దాసరి గారికి మొదటి సినిమా అవకాశం ఎవరైతే ఇచ్చారో అదే నిర్మాత కోడి రామకృష్ణ కి దర్శకుడిగా మొదటి సినిమాకి అవకాశం ఇచ్చారు.

ఆయనే అగ్ర నిర్మాత కె.రాఘవ. కోడి రామకృష్ణ సినిమాలలోకి రాకముందు సొంతూరైన పాలకొల్లులో నాటకాలు వేసేవారు. పాలకొల్లు అంటే నాటక కళాకారులు, సినీ కళాకారులకి పెట్టింది పేరు. ఆ ఊరు నుంచి వచ్చిన వారెవరైనా ఇండస్ట్రీలో గానీ, నాటక రంగంలో గానీ అగ్ర స్థానానికి చేరుకుంటారు. అందుకే రామకృష్ణకు చిన్నప్పటి నుంచీ నాటకాల పట్ల చాలా ఆసక్తి వుండేది. పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు వేస్తుండేవారు. రామకృష్ణ కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు పాలకొల్లు పిలిపించేవారు.

రామకృష్ణ తన స్నేహితులు మాట్లాడే మాటల నుంచి రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు బాగా గమనించేవారు. అలాంటి వారిని ఎన్నుకుని అందుకు తగ్గ పాత్రలు రాసి వారితో నటింపజేసేవారు. అంటే రామకృష్ణలో అప్పటి నుంచే దర్శకుడయ్యే లక్షణాలు మెండుగా ఉండేవి. ఇక రామకృష్ణ స్పీచ్ ఏదైనా ఇచ్చారంటే అందరూ అభినందించేవారు. అలా ఓసారి రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని చేసి ఏకపాత్రను ప్రదర్శించారు. దీనికి మంచి పేరు వచ్చింది. ఇలా అడుగడునా ఆయనకై సినిమాల మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

ఇక కోడి రామకృష్ణకు దర్శకుడిగా మొదటి సినిమా చిరంజీవి నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య ఎన్నో చర్చల తర్వాత 1981లో రిలీజైంది. టైటిల్ విషయంలో కూడా వివాదం రాజుకుంది.  వాస్తవంగా కోడి రామకృష్ణ మొదట సినిమాగా తరంగిణి తీయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో మొదటి సినిమాగా ఇంట్లో రామయ్య తెరకెక్కించి దర్శకుడయ్యారు. ఈ సినిమా 500 రోజులకి పైగా ఆడి ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. చిరంజీవి కెరీర్ లో మళ్ళీ ఏ సినిమా ఇలా 500 రోజులకి పైగా ప్రదర్శించబడలేదు.

ఇక కోడి రామకృష్ణ వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి శత చిత్రాల దర్శకుడిగా గొప్ప రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్ గార్లు మాత్రమే. అయితే హీరోకి ఉండే ఐడెంటిటీ కోడి రామకృష్ణ కి ఉంటుంది. అదే ఆయన చేతికి ఎప్పుడు కనిపించే రకరకాల తాళ్ళు, నుదురుకి కట్టు, చేతికి రక రకాల ఉంగరాలు. ఇవన్నీ కోడి రామకృష్ణకి పెద్ద సెంటిమెంట్. ఆయన మొదటి సినిమా భారీ హిట్ అయినా వెంటనే దర్శకుడిగా అవకాశాలు దక్కలేదు. దాంతో  బాధపడుతున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ జెవి. రాఘవ మొదటి సినిమా హిట్ అయితే అవకాశాలు రావు.. రెండవ సినిమా కూడా హిట్ అవ్వాలి అన్నారు.

దాంతో కోడి రామకృష్ణ మురుగన్ కి మొక్కుకొని.. ఆయన సెకండ్ పిక్చర్ కూడా హిట్ అయితే ఎప్పటికీ నీ ఉంగరం పెట్టుకుంటానని కోరుకున్నారట. ఆయన సెకండ్ మూవీ తరంగిణి కూడా 500 రోజులు ఆడింది. అప్పటి నుంచి మురుగన్ ఉంగరం పెట్టుకుంటున్నారు. ఇక ఆయన తలకి కట్టు కట్టుకోవడం కూడా కాస్ట్యూమర్ సలహా మేరకు కట్టుకున్నారట. ఇది ఎప్పుడు మీకు ఉండాలి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉంటారు. అసలు తీయవద్దని చెప్పారట. అప్పటి నుంచి కోడి రామకృష్ణ చనిపోయే వరకు సినిమా డైరెక్షన్ చేసినా.. బయటికి కథా చర్చలకి వచ్చినా తలకి తప్పకుండా కట్టు కట్టుకుంటారు. ఇక ఆయన చేతికి ఉండే తాళ్ళు.. దుష్ట శక్తులనుంచి రక్షణ కోసం. అమ్మవారి సినిమాలు ఎక్కువగా చేస్తున్న కారణంగా కొన్ని దుష్ట శక్తులు కూడా ఆయన చుట్టూ ఉంటాయని పూజారులు చేతికి పూజా చేసిన తాళ్ళు కట్టారట. అలా ఆయనకి ఈ మూడు సెంటిమెంట్స్ గా వచ్చాయి. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago