Movie News

నువ్వు చెల్లివి అవుతావో… చంచల్ గూడ ఖైదీవి అవుతావో.. అంటూ మోనితకు షాక్ ఇచ్చిన దీప!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు
1105 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ సీరియల్ లో కార్తీక్,మోనితకు పెళ్లి జరుగుతుందా..? లేదా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో భాగంగా మోనితకు రిజిస్టర్ నుంచి ఫోన్ రావడం, పెళ్లికి అభ్యంతరం చెప్పడం, ఏసిపి రోషిని నుంచి ఫోన్ రావడంతో మోనితకు తెగ కంగారు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తుండగానే మోనిత ఇంటికి దీపా ఎంట్రీ ఇచ్చి మరింత కంగారు పెడుతుంది. దీపని చూసి మరింత కంగారుకు గురైన మోనితను చూసి నా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావేంటి.. అంటూ దీప షాక్ ఇస్తుంది.

అక్క వచ్చి కాఫీ అడుగుతుంటే అలా నిల్చోని చూస్తున్నావ్ ఏంటి అంటూ ప్రియమణిపై మోనిత మండి పడటంతో అక్క అంటే నీ శరీరంలో ఒక ముక్క కూడా మిగలదని నీకు ఇంకా అర్థం కాలేదా? గుంట నక్కలకు అక్కలు చెల్లెల్లు ఉండరు పిచ్చిదానా అంటూ మోనిత తలపై మొటిక్కాయ వేయడానికి దీప చెయ్యి పైకెత్తితే భయంతో సోఫాలో పడిపోతుంది. ఈ క్రమంలోనే మోనిత మదిలో రిజిస్టర్ దుర్గాప్రసాద్, ఏసీపీ ఫోన్ కాల్, అంజి గురించి ఏవేవో ఆలోచనలు మెదులుతున్న క్రమంలో నీకు ఫోన్ వచ్చిందా.. అని దీప అడగడంతో మోనితకు కంగారు పడుతుంది. అప్పుడే రోషిని ఫోన్ రావడంతో కంగారుపడిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయగానే బయల్దేరావా.. అంటూ సీరియస్ గా ఏసిపి రోషిని అడుగుతుంది. కంగారుగా ఆ.. బయలుదేరాను మేడమ్ వస్తున్నా.. నీ కోసం కూడా నేను వెయిట్ చేయాలా త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

ఫోన్ కట్ చేసిన తర్వాత మోనిత ఏసీపీ దగ్గరికి వెళ్తున్న మీ అందరి అంతు తేలుస్తా.. అనడంతో దీప చిటికెలు వేసే వెళ్తున్నా… కాదు వెళ్తున్నాం.. ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అంటూ రామ్మా.. చిలకమ్మా నీ చిలకపలుకులు అక్కడ వినిపిద్దువు. అక్కడ అంజి నీ పాత కథల గురించి ఏం చెబుతున్నాడో… ఏమో.. నువ్వు నువ్వు నాకు చెల్లెలివి అవుతావో… లేక చంచల్ గూడ ఖైదీవీ అవుతావో అంటూ మోనిత మెడ పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. ఇలా ఇద్దరూ కలిసి రోషిని ఇంటికి వెళ్లడంతో రోషిని ఇద్దరికీ వెల్కమ్ చెబుతుంది. ఈ క్రమంలోనే మీ ఇద్దరిలో ఎవరు ఎవరిని ఇక్కడికి తీసుకు వచ్చారనీ అడగటంతో మోనిత ఇంటికి వెళ్తే మీ ఫోన్ వచ్చింది.. అందుకే ఇద్దరు కలిసి వచ్చాము అంటూ దీప సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే
మోనిత చెప్పండి మేడం అర్జెంట్గా రమ్మన్నారు అని అడగడంతో.. అంజి అని ఏసీపీ చెప్పగా మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈక్రమంలోనే ప్రశ్నలపై ప్రశ్నలు అంజి గురించి అడుగుతూ రోషిని మోనితలో కంగారు పుట్టిస్తుంది. మరి రోషిని ప్రశ్నలకు మోనిత ఎలా సమాధానం చెబుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago