Featured

తెలుగులో ఇలాంటి పాత్ర ఎవరు చేసుండరు.. కాని ఈ హీరోయిన్ మాత్రం ధైర్యం చేసింది..!!

సినీ పరిశ్రమలో కొన్ని పాత్రలు చేయాలంటే నవరసాలు పండించే నటనా వైదుష్యం ఉండాలి. లేదా సమాజంలో జరిగే అంశాలపైన వ్యక్తులపైన అవగాహన ఉండాలి. అలా వెండితెరపై పాత్ర ఏదైనా అవలీలగా నటించే సామర్థ్యం వస్తుంది. దక్షిణభారత భాషల్లో నటించిన అభినేత్రి, జాతీయ అవార్డులు సైతం దాసోహం అన్న నటనా గాయత్రి. కళాత్మక చిత్రాల్లో అభినయించిన ఈ నటి కమర్షియల్ చిత్రాల్లో కనుమరుగయ్యింది. భారతిరాజా నుంచి బాలుమహేంద్ర వరకు అబ్బురపోయె నటనను కనబరిచిన నట శిఖామణి. ఒకరోజు ప్రముఖ అమెరికన్ డైరెక్టర్ విలియం గ్రీన్స్ ఒకసారి మద్రాసు వచ్చారు.

అక్కడ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోకి అడుగు పెట్టినప్పుడు. ప్రముఖ నటుడు నాజర్ అర్చన ఇద్దరు కలిసి కొన్ని రిహార్సల్స్ చేస్తున్నారు. అందులో నటిస్తున్న అర్చన అభినయాన్ని చూసి ఆశ్చర్యపోయిన విలియం గ్రీన్స్ ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బాలుమహేంద్రకు పరిచయం చేయడం జరిగింది. అర్చన చామన ఛాయలో ఉందని చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలోకి తీసుకోవడానికి తిరస్కరించారు. ఆ క్రమంలో అర్చన మట్టిలో మాణిక్యం లాగా బాలుమహేంద్రకు కనిపించింది. అనుకున్నదే తడవుగా 1981లో “తాయ్ పొంగల్” అనే తమిళ చిత్రంలో మొదటగా నటించింది.

1986లో హీరోయిన్ గా “నిరీక్షణ” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో నటించడానికి చాలా మంది హీరోయిన్స్ వెనుకంజ వేశారు. ఎందుకంటే కథాపరంగా గిరిజన తండాలో ఓ యువతి జాకెట్ లేకుండా కేవలం చీరను చుట్టుకునే పాత్రలో కనిపించే హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బోల్డ్ అటెంప్ట్, కావున హీరోయిన్స్ ఆ పాత్రను చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. బాలుమహేంద్ర చెప్పిన కథ, ముఖ్యంగా అశ్లీలతకు అవకాశం లేకుండా సహజత్వానికి అద్దం పట్టే బాలు మహేంద్ర దర్శకత్వం నచ్చి అర్చన ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా బాలు మహేంద్ర కూడా అర్చన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి అసభ్యతకు అవకాశం లేకుండా నిరీక్షణ చిత్రాన్ని తీసి ఘన విజయాన్ని అందించాడు.

ఓ పట్నం యువకుడు గిరిజన తండాకు వచ్చి తనను ప్రేమించి, చెయ్యని నేరానికి పోలీస్ చేతుల్లో చిక్కుకొని జైలుకు వెళితే అతని రాక కోసం ఎదురు చూసే పాత్రలో అర్చన నటన అందరి చేత శెభాష్ అనిపించుకుంది. ఈ చిత్రంలో అర్చన నటనకు నంది అవార్డు, భానుచందర్ కి ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. నిరీక్షణ సినిమా తరువాత అనేక కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఎక్కువగా కళాత్మక, సహజత్వంగా ఉండే చిత్రాలకే మొగ్గుచూపారు. అలా ఆమె వెండితెరకు కొంచెం దూరం అయ్యిందనే చెప్పాలి. అర్చన తాను గురువుగా చెప్పే బాలుమహేంద్ర దర్శకత్వంలో దాదాపు ఐదు చిత్రాల్లో నటించడం ఓ విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago