Categories: FeaturedMovie News

అప్పట్లో రిజిస్టర్ మ్యారేజ్.. ఇప్పుడు పెళ్లి చెల్లదంటూ మొదటి భార్య గోల.. ప్రియమణి పరిస్థితి ఇది!

సినీ నటి ప్రియమణి వివాహ బంధం గురించి గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఆమె చేసుకున్న వివాహం చట్టపరంగా చెల్లదంటూ ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంపై ముస్తఫా స్పందిస్తూ తనకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన తరువాతనే ప్రియమణిని 2017 లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లి అంటే పెద్ద ఎత్తున హంగు ఆర్బాటాలు ఉంటాయి. కానీ కానీ ప్రియమణి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా కేవలం రిజిస్టర్ ఆఫీస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.

ప్రియమణి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి జరుపుకోవడానికి గల కారణాలను కూడా ప్రియమణి ఓ సందర్భంలో తెలియజేశారు. ముస్తఫా, ప్రియమణి మతాలు వేరు కావడం వల్ల ఎవరి సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగకుండా రిజిస్టర్ ఆఫీస్ లో తమ వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరి వివాహం తర్వాత వివాహ రిసెప్షన్ కు పలువురు సినీతారలను ఆహ్వానించి ఎంతో వైభవంగా వివాహ రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న క్రమంలో ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వీరి పెళ్లి చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్ట పరంగా ముస్తఫా తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లి చేసుకోవడం వల్ల వీరి వివాహం చెల్లదని ఇప్పటికీ ముస్తఫా భార్యగా నాకు ఆ అర్హత ఉందంటూ ఆరోపించారు.

ఈ విషయంపై ప్రియమణి దంపతులు మాట్లాడుతూ చట్టపరంగా తనకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ముస్తఫా వివాహం జరిగిందని, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండడంచేత వారి సంరక్షణ కోసం ముస్తఫా డబ్బులు పంపిస్తున్నారని,తన నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం కోసమే అయేషా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ముస్తఫా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రియమణి మాట్లాడుతూ తమ వివాహ బంధానికి ఎలాంటి డోకా లేదని, ఎవరు ఎన్ని చెప్పినా చట్ట ప్రకారమే తమ వివాహం జరిగిందని, తన వైవాహిక జీవితానికి ఏ ప్రమాదం లేదంటూ ప్రియమణి ఎంతో సాఫీగా సమాధానం చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago