బుల్లితెరపై అద్భుతమైన విజయంతో దూసుకుపోతున్న కార్యక్రమాలలో “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. మొదట్లో ఈ కార్యక్రమం హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ పేరుతో ప్రసారమయ్యేది.దీని ఆధారంగానే తెలుగులో ఇప్పటి వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ నాలుగు సీజన్లలో పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కొద్దిగా మార్పులు చేసి “ఎవరు మీలో కోటీశ్వరుడు?”ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే గత సీజన్లలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించగా..ఈ సారి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పటికే ఈ కార్యక్రమం బుల్లితెరపై ప్రసారం కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం చేత ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లీక్ అయింది. మరి ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఎంత గెలుచుకున్నాడు అని విషయానికి వస్తే…
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ తనదైన శైలిలో ఆటలు ఆడి ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రామ్ చరణ్ గెలుచుకున్న పాతిక లక్షలను ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించారన్న వార్త వినబడుతోంది.అయితే ఎన్టీఆర్, చరణ్ కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ఆగస్టు 15 16 తేదీలలో ప్రసారం కానుందని సమాచారం.
































