Tag Archives: gulten sensitivity

ఈ సమస్యతో బాధపడుతున్నారా… గోధుమ పిండి రోటీలు అస్సలు తినకూడదు!

సాధారణంగా చాలా మంది వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. శరీర బరువు తగ్గాలనుకొనే వారు వివిధ రకాల డైట్ ఫాలో అవుతూ… మంచి జీవనశైలిలో ఉండటానికి ఒక ప్రణాళికాబద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది రాత్రి పూట భోజనానికి బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన రోటిలను తింటూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి డైట్ ఫాలో అయ్యేవారు గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడుతుంటే అలాంటి వారు వారి ఆహార విషయంలో గోధుమ పిండితో చేసిన రోటీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడేవారు వారు తీసుకునే ఆహారంలో గ్లూటెన్ ఉందో లేదో తెలుసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల డయేరియా, కడుపులో నొప్పి, మైగ్రేషన్ అలసట, డిప్రెషన్ వంటి లక్షణాలు ఉంటాయి. కనుక మనం తినే పదార్థాల్లో గ్లూటెన్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

మన శరీరంలో గ్లూటెన్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది.ఈ క్రమంలోనే మనం ముందుగా గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకొని మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవాలి.ఒకవేళ గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు కడుపులో నొప్పి డయేరియా లేదా డిప్రెషన్ వంటి లక్షణాలు కలిగినప్పుడు మనం ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

ఈ విధంగా మీ శరీరంలో గ్లూటెన్ ఉందో లేదో ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు గ్లూటెన్ తో బాధపడుతుంటే గోధుమ పిండితో చేసిన రొట్టెలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే గోధుమ పిండికి బదులుగా రాగి, జొన్న వంటి పిండితో తయారు చేసుకున్న రొట్టెలను తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.