Tag Archives: haryana black fungus cases

హర్యానాలో బ్లాక్ ఫంగస్ విలయ తాండవం.. ఒక్కరోజులోనే 18 మంది మృతి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కేసులు పెరుగుదల కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న మని ఆనందం కూడా లేకుండా బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దేశంలోనే అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా తరువాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటలలో హర్యానాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, ఏకంగా ఈ ఫంగస్ బారిన పడి 18 మంది మృతి చెందారు. హర్యానాలో కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఇంజక్షన్ లతోపాటు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా కొరత ఏర్పడటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయగా కేవలం ఐదు శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిపారు.బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సలో వాడే యాంటీ-ఫంగల్ ఔషధం ‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’ హరియాణాలో తగినంత అందుబాటులో లేకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే యాంటీ ఫంగల్ ఔషధం
‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’రోజుకు నాలుగు సార్లు ఇవ్వడం ద్వారా ఈ ఫంగస్ నుంచి తొందరగా కోలుకో వచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే తీవ్రమైన మందుల కొరత ఏర్పడటంతో ఔషధాన్ని కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే బాధితులకు అందివ్వాలని హర్యానా నిపుణుల కమిటీ గత రెండు రోజుల క్రితం సూచించింది. అయితే ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 25వ తేదీ వరకు హర్యానా రాష్ట్రానికి 1,110 అంపోటెరిసిన్-బి అందజేశామని కేంద్రం తెలిపింది.