ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కేసులు పెరుగుదల కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న మని ఆనందం కూడా లేకుండా బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
దేశంలోనే అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా తరువాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటలలో హర్యానాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, ఏకంగా ఈ ఫంగస్ బారిన పడి 18 మంది మృతి చెందారు. హర్యానాలో కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఇంజక్షన్ లతోపాటు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా కొరత ఏర్పడటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయగా కేవలం ఐదు శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిపారు.బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సలో వాడే యాంటీ-ఫంగల్ ఔషధం ‘అంపోటెరిసిన్ బి లిపోజమ్’ హరియాణాలో తగినంత అందుబాటులో లేకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే యాంటీ ఫంగల్ ఔషధం
‘అంపోటెరిసిన్ బి లిపోజమ్’రోజుకు నాలుగు సార్లు ఇవ్వడం ద్వారా ఈ ఫంగస్ నుంచి తొందరగా కోలుకో వచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే తీవ్రమైన మందుల కొరత ఏర్పడటంతో ఔషధాన్ని కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే బాధితులకు అందివ్వాలని హర్యానా నిపుణుల కమిటీ గత రెండు రోజుల క్రితం సూచించింది. అయితే ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 25వ తేదీ వరకు హర్యానా రాష్ట్రానికి 1,110 అంపోటెరిసిన్-బి అందజేశామని కేంద్రం తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…