ప్రస్తుతం మన దేశంలో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి వల్ల వేల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.అలాంటి వారికి అండగా నిలిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్..తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపిన ఆయన.. తాజాగా దేశమంతా ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.umeedbysonusood.com అనే వెబ్ సైట్ స్టార్ట్ చేసారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి. ఆక్సిజన్ ఎవరికీ కావాలో, ఎక్కడకి కావాలో సమాచారం అందిస్తే.. అవసరమైన వారికి డీటీడీసీ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపుతానని సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం దేశమంతా ఆక్సిజన్ సిలిండర్స్ కోసం ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఎవరికీ అవసరమైనా… ఎంతదూరం నుంచి ఆక్సిజన్ కావాలని అడిగినా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా మొత్తంగా ఎవరికి ఆక్సిజన్ అవసరం ఉన్నా..ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను నెలకొల్పారు సోనూసూద్. ఈ నిర్ణయంతో.. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
గతేడాది కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కష్టంలో ఉన్న అందరికీ సాయం చేస్తూ వచ్చారు సోనూసూద్. సొంత ఖర్చులతో నిర్విరామంగా.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇక సెకండ్ వేవ్‌లో సోనూసూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాల లెక్కలేనన్ని. అందుకే, కరోనా విపత్కర కాలంలో సోనూ సూద్ పేరు భారతదేశంలో కొండంత భరోసాని కల్పిస్తోంది. http://www.umeedbysonusood.com…ఓ చాట్ బోట్.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అవసరం అయిన పేషెంట్లు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఆపై ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను మీ ఇంటికి వాళ్ళే తెచ్చి ఇస్తారు. అదీ ఉచితంగానే..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…