General News

తల్లికి నెగిటివ్.. కడుపులో బిడ్డకు పాజిటివ్.. చివరికి ఏమైందంటే?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తారు.తనకు ఏ చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే డాక్టర్లను సంప్రదించి తన బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు పడతారు. ఈ క్రమంలోనే తల్లికి ఏదైనా వ్యాధి సంక్రమించిన అది బిడ్డకు సోకకుండా వైద్య శాస్త్రం బిడ్డకు ఎంతో రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తల్లి ఎన్నో రకాల వ్యాధుల బారినపడినప్పటికీ ఆ వ్యాధుల బారిన పడకుండా బిడ్డను రక్షిస్తుంది.

తాజాగా వైద్యులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఒక విచిత్ర సంఘటన వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసికి చెందిన అనిల్ ప్రజాపతి అనే వ్యక్తి నెలలు నిండిన తన భార్య సుప్రియను ప్రసవం కోసం బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఎస్ ఆస్పత్రికి ఈ నెల24 ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే అక్కడి వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా సుప్రియకు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.

ఈ క్రమంలోనే వైద్యులు మరుసటిరోజు ఆమెకు ప్రసవం చేశారు. సుప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్యులు పుట్టిన శిశువుకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ శిశువు పరీక్షల ఫలితాలను చూసి డాక్టర్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా ఫలితాలలో పాజిటివ్ వచ్చింది. తల్లికి కరోనా లేకున్నా బిడ్డకు పాజిటివ్ రావడంతో డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన భార్యకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. కానీ బిడ్డకు మాత్రం పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పరీక్ష ఫలితాలు తప్పుగా వచ్చి ఉంటాయని ఆయన తెలిపారు. ఈ విషయమే ఆసుపత్రి సూపర్-ఇండెంట్ మాట్లాడుతూ మరి కొద్ది రోజులలో తల్లి బిడ్డ ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago