ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ సెన్సేషన్ గా మారిపోయింది ఫారియా అబ్దుల్లా.రీసెంట్ గా వచ్చిన “జాతిరత్నాలు” మూవీతో తెలుగుతెరకు పరిచయం అయిన ఈ ఆరడుగుల అందాన్ని.. ప్రస్తుతం జనరేషన్ ఎవరూ అంత సులువుగా మరిచిపోలేరు. ఫస్ట్ మూవీలోనే తన క్యూట్ స్మైల్, అట్రాక్టివ్ ఫేస్ తో.. యూత్ లో గిలిగింతలు పెట్టింది. హైదరాబాద్ లో జన్మించిన ఫారియా అబ్దుల్లాకు.. చిన్ననాటి నుంచి కళలంటే ఆసక్తి.
తన స్కూలింగ్ సమయంలోనే పెయింటింగ్, డ్యాన్స్, యాక్టింగ్ వంటి వాటిమీద దృష్టి పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత పలు నాటకాలలో నటించింది. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఫారియా అబ్దుల్లా.. మొదట్లో మోడలింగ్ చేసేది. ఆ తరువాత యూట్యూబర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో ఒక పాత్ర పోషించింది. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాలో నటించే అవకాశం రావడంతో.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు.. సౌత్, నార్త్ లోనూ మూవీస్ చేసేందుకు సిద్ధమని చెబుతున్న ఫారియా అబ్దుల్లా.. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రంలు మాత్రమే చేస్తానని చెబుతోంది.
జాతిరత్నాలు ఇచ్చినా జోష్ తో ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. ఇప్పటికే రవితేజ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన ఈ లేడీ జాతిరత్నం ఇప్పుడు యంగ్ హీరో యంగ్ హీరో నితిన్ జోడీ కట్టబోతోదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలో నితిన్ హీరోగా వస్తున్నా సినిమాకు కధానాయికగా ఫారియా అబ్దుల్లా ఖారారయిందనే వార్త ఫిలింనగర్ లో జోరురండుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలుతో బిజీ బిజీగా ఉన్నాడు హీరో నితిన్. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవికాస్త మిక్సిడ్ టాక్ రావడం జరిగింది. త్వరలో మ్యాస్ట్రో సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. వాటిలో ఒక సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది..!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…