గత కొద్ది రోజుల నుంచి కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మశాన వాటికలలో అంత్యక్రియలు నిర్వహించడానికి కుదరని నేపథ్యంలో కొందరు శవాలను గంగానదిలో వేయడంతో శవాలు నది ఒడ్డుకు కొట్టుకు రావడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరాఖండ్ లోని ఫితోరాఘడ్ సరయు నది ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫితోరాఘడ్ సరయు నదిలో గుర్తు తెలియని శవం ఒకటి కొట్టుకు వచ్చింది. అయితే ఈ శవం సగం కాలిపోయి ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ శవం ఆ పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ వద్ద కనిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గత కొద్దిరోజుల నుంచి గంగానదిలో కూడా ఈ విధంగా శవాలు కొట్టుకు రావడంతో ఆ శవాలన్ని కరోనా బాధితులవని తెలిపారు. ఈ క్రమంలోనే సరియు నది ప్రాంతంలో కొట్టుకొచ్చిన శవం కూడా కోవిడ్ బాధితుడిదనే ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే అది కోవిడ్ తో మరణించిన శవమా లేదా అనే విషయం నిర్ధారణ కావలసి ఉంది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై స్పందించిన అధికారులు అది కరోనాతో మృతిచెందిన వ్యక్తి శవమా? కాదా? అనే విషయం నిర్ధారణ కాలేదు. కనుక ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా త్రాగు నీటిలో శవాలు కొట్టుకు రావడంతో ఇవి నీటిని కలుషితం చేసి మరిన్ని అనారోగ్య సమస్యలను కలిగిస్తాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…