కరోనా కష్టకాలంలో మరో గొప్ప నిర్ణయం తీసుకున్న ‘సోనూసూద్’.. ఇక దేశమంతటా ఉచితంగా..!!

0
58

ప్రస్తుతం మన దేశంలో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి వల్ల వేల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.అలాంటి వారికి అండగా నిలిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్..తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపిన ఆయన.. తాజాగా దేశమంతా ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

www.umeedbysonusood.com అనే వెబ్ సైట్ స్టార్ట్ చేసారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి. ఆక్సిజన్ ఎవరికీ కావాలో, ఎక్కడకి కావాలో సమాచారం అందిస్తే.. అవసరమైన వారికి డీటీడీసీ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపుతానని సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం దేశమంతా ఆక్సిజన్ సిలిండర్స్ కోసం ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఎవరికీ అవసరమైనా… ఎంతదూరం నుంచి ఆక్సిజన్ కావాలని అడిగినా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా మొత్తంగా ఎవరికి ఆక్సిజన్ అవసరం ఉన్నా..ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను నెలకొల్పారు సోనూసూద్. ఈ నిర్ణయంతో.. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

గతేడాది కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కష్టంలో ఉన్న అందరికీ సాయం చేస్తూ వచ్చారు సోనూసూద్. సొంత ఖర్చులతో నిర్విరామంగా.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇక సెకండ్ వేవ్‌లో సోనూసూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాల లెక్కలేనన్ని. అందుకే, కరోనా విపత్కర కాలంలో సోనూ సూద్ పేరు భారతదేశంలో కొండంత భరోసాని కల్పిస్తోంది. www.umeedbysonusood.com…ఓ చాట్ బోట్.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అవసరం అయిన పేషెంట్లు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఆపై ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను మీ ఇంటికి వాళ్ళే తెచ్చి ఇస్తారు. అదీ ఉచితంగానే..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here