Tag Archives: healrt problem

Health Tips: అతిగా నిద్ర పోతున్నారా.. అంతే సంగతులు.. గుండె పోటుకు దగ్గరవుతున్నట్లే…!

Health Tips: నిద్ర ఎక్కువైనా.. తక్కువైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మనిషికి నిద్ర అనేది అత్యవసరం. నిద్ర లేనిదే.. మన ఆరోగ్యంగా ఉండలేము. అతిగా నిద్ర పోయినా.. సరిగ్గా నిద్ర పోకున్నా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిద్ర తగినంత లేకుంటే.. మన శరీరంలో మెదడు సరిగ్గా పనిచేయలేదు. 

Health Tips: అతిగా నిద్ర పోతున్నారా.. అంతే సంగతులు.. గుండె పోటుకు దగ్గరవుతున్నట్లే…!

సాధారణంగా 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలనీ వైద్యులు చెబుతుంటారు. మనం అలసిపోయినా.. అనారోగ్యంతో ఉన్నా ముందుగా వచ్చేది నిద్రే. నిద్రలోకి జారుకుంటే మన అలసట ఎగిరిపోతుంది. అయితే అతిగా నిద్రపోయినా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Health Tips: అతిగా నిద్ర పోతున్నారా.. అంతే సంగతులు.. గుండె పోటుకు దగ్గరవుతున్నట్లే…!

ఇటీవల మెడికల్ జర్నరల్ న్యూరాలజీలో ఓ పరిశోధన కథనం ప్రకారం… ఎక్కువగా నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజూ మధ్యాహ్నం 30 నిమిషాల పాటు కునుకు తీసే వారితో పోలిస్తే 90 నిమిషాలు నిద్రపోయే వారిలో గుండె పోటు ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధన తేల్చింది. అయితే 30 నిమిషాలు మాత్రమే నిద్రపోయే వారిలో గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

9 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారికి రిస్కే..

ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం నిద్రపోని వారిలో గుండె పోటు వచ్చే అవకాశమే ఉండదని పరిశోధన తేల్చింది. అతిగా నిద్రపోయే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ అవుతాయని, ఛాతీ సైజు పెరగడం వంటి అనారోగ్య లక్షణాలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చైనాకు చెందిన 62 ఏళ్లకు పైబడిన 31,750 మందిపై అధ్యయనం నిర్వహించిన తర్వాత జినోయివోమినంగ్ అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. ఆరేళ్ల అధ్యయనంలో 1557 గుండె పోటు కేసులు నమోదైనట్లు పేర్కొ న్నారు. రాత్రి వేళ 7 గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోయే వారితో పోల్చితే 9 గంటలు కంటే అధికంగా నిద్రపోయేవారికి గుండెపోటు 25 శాతం ఎక్కువని గుర్తించామన్నారు.