Tag Archives: health benefits of curd

వర్షాకాలంలో పెరుగు తింటున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి..!

పెరుగు అన్నం అంటే ఎవ్వరైనా ఇష్టపడతారు. కడుపులో చల్లదనం కోసం పెరుగు తింటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపులో మంటను కూడా పెరుగు తగ్గించేస్తుంది. అందులో ఉండే ఎంజైమ్ మలబద్దకం నుంచి కూడా బయటపడేస్తుంది. అంతే కాకుండా నిద్రలేమితో బాధపడే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే వానాకాలంలో మాత్రం పెరుగు తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందకంటే.. దీని వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు ఒక్కటే కాదు పెరుగుతో తయారయ్యే ఏ ఇతర పదర్ధాలను కూడా తినడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి లాంటివి కూడా తీసుకోవడం మంచిది కాదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాక్టీరియా ఎక్కువ కావడం ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. గొంతులో ఏదో పట్టేసినట్లు ఉంటుందని.. దీంతో ఏం తినాలన్నా ఇబ్బందిగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. చాలామందికి ఉదయమే పెరుగు తినడం అలవాటు ఉంటుంది. కానీ ఈ సీజన్ లో అలా తీసుకోవడం వల్ల అంతక ముందు కీళ్ల నొప్పులు లాంటివి ఉంటే.. అవి మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుందట. అందుకే ఆయుర్వేదం ప్రకారం.. భాద్రపద మాసంలో పెరుగు తినడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు.