Tag Archives: heros remunerations

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

అప్పట్లో కథే హీరో. రచయిత ఓ కథను రాసి దాన్ని నిర్మాతకు చెప్పిన తర్వాత గానీ ఈ కథకు ఏ హీరో అయితే సూటవుతాడు.. ఏ దర్శకుడైతే ఇలాంటి కథను బాగా డీల్ చేస్తాడు అని నిర్ణయాలు తీసుకునేవారు. అప్పటి పెద్ద నిర్మాణ సంస్థలు అయిన ఏవీఎం, వాహిని స్టూడియోస్ ఇలాగే సినిమాలను నిర్మించేవి. ఆ తర్వాత మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు – ఆయన తనయుడు డి సురేశ్ బాబు లాంటి వారు కూడా ముందు కథకే ప్రాధాన్యం ఇచ్చారు..ఇస్తున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి వారు పెద్ద స్టార్ అని నిర్మాతలు సినిమా తీసేవారు కాదు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ ఇప్పుడు చాలా వరకు విధి విధానాలు మారిపోయాయి. నిర్మాత ముందు హీరోను ఒప్పించుకొని డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. ఎప్పటికో ఒకప్పటికి తగ్గ కథ తీసుకొని దర్శకుడు, రచయిత వస్తే దాన్ని ఆ హీరోకు చెప్పి నచ్చితే సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. అప్పట్లో కథ అనుకున్నాక.. కాస్టింగ్, లొకేషన్స్ ఫైనల్ చేసుకొని ఓ పరిమిత బడ్జెట్ పెట్టుకునేవారు. దాదాపు అప్పటి నిర్మాతలందరూ చాలా కఠినంగా వ్యవహరించేవారు కాబట్టే అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీయగలిగారు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ, ఇప్పుడు సినిమాకు అనుకున్న బడ్జెట్ అదుపు తప్పడం చాలా కామన్  అయిపోయింది. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తేనే గొప్ప అనే భావన చాలా మందిలో వచ్చేసింది. ఓ హీరో డేట్స్ లాక్ చేసుకున్నాక..అప్పటి వరకు ఆ హీరో చేసిన సినిమాల జోనర్ ఏంటీ.. ఇప్పుడు ఏ కథ అల్లి ఆ హీరోతో సినిమాను చేయాలి అని కథలు రాసుకుంటున్నారు. అందుకే కొన్ని సినిమాల విషయంలో బడ్జెట్ కంట్రోల్ తప్పుతుంది కూడా. ఇప్పుడు హీరో..అతని మార్కెట్‌ను బట్టి సినిమా నిర్మాణం ఉంటోంది.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

అలాగే భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ హీరో అంటే ఇప్పుడు ఖచ్చితంగా 200 కోట్ల పైనే నిర్మాణ వ్యయం అవుతోంది. ఎందుకు అంటే ఆయన పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి తరువాత 100 కోట్ల లోపు నిర్మిస్తున్న ఒక్క సినిమా కూడా ప్రభాస్ చేస్తున్న వాటిలో లేదని అందరికీ తెలిసిందే. ప్రభాస్ మార్కెట్ అండ్ పాన్ ఇండియన్ క్రేజ్ చూసి అందరూ అదే ఫాలో అవుతూ వాటిని రీచ్ అవ్వాలని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ సాధించాలని తాపత్రయపడుతున్నారు.  

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

ఈ కారణంతోనే పాన్ ఇండియన్ సినిమా అని హీరో ఎవరైనా బడ్జెట్ 200 కోట్ల వరకు పెట్టి పలు భాషలలో రిలీజ్  చేస్తున్నారు. ఇందులో దర్శక, హీరోలకు లాభాలు వస్తే వచ్చే వాటా ఎక్కువే. కానీ ఇలా ఎన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెడతాయో గ్యారెంటీ లేదు. ఏమాత్రం కథ ఉండని సినిమాలకు పెద్ద హీరో, భారీ బడ్జెట్ ఖర్చు చేసి నష్ఠాల ఊబిలో కూరుకుపోతున్న నిర్మాతలు ఉన్నారు. పాన్ ఇండియన్ సినిమాను 100 కోట్ల లోపు పూర్తి చేసే దర్శకుడు ఎప్పుడు తయారవుతాడో చెప్పడం కష్ఠమే. అవసరమైతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా చేస్తున్నారు గానీ, ఎక్కడెక్కడ బడ్జెట్ తగ్గించి సినిమా పూర్తి చేయాలి అనే ఆలోచన మాత్రం చాలామంది చేయడం లేదని చెప్పక తప్పదు.