Tag Archives: hindu

Anchor Rashmi: నేను హిందూ అయినా ఎప్పటికీ ఆ పని చేయను… యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్!

Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రశ్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటుంది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

స్వతహాగా జంతు ప్రేమికురాలు అయినా రష్మి, మూగజీవాల సంరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మూగజీవాలను సంరక్షించమని అందరినీ వేడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా రోడ్లమీద ఆహారం లేకుండా ఉండే మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉంటుంది. ఇలా తరచూ జంతువుల పట్ల తన ప్రేమను చూపించే రష్మీ తాజాగా సోషల్ మీడియా ద్వారా మరొక పోస్ట్ షేర్ చేసింది.

ఆ పోస్ట్ కి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కి రష్మి సరైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల బుల్ ఫైట్ కి సంబంధించిన ట్వీట్ కి రష్మి రిప్లై ఇస్తూ.. ‘ఇలాంటి క్రీడలను ఎంజాయ్ చేస్తూ రాత్రి పూట ఎలా నిద్రపోతారు’ అని రష్మీ ట్వీట్ చేసింది. దీంతో ఒక నెటిజన్.. ‘సినీ పరిశ్రమలో ఉన్న మీరు లెదర్ ఉత్పత్తులను ఎలా వాడతారు? ముందు మీరు వాటిని నిషేధించండి. ఆ తర్వాత ప్రతీది నిషేధించబడుతుంది’ అంటూ కామెంట్ చేశాడు.

Anchor Rashmi: ఎప్పటికీ లెదర్ వస్తువులు వాడను…

నెటిజన్ చేసిన కామెంట్ కి రష్మి స్పందిస్తూ..” నేను సినీ పరిశ్రమ నుంచే వచ్చాను. నేను లెదర్ ఉత్పత్తులు వాడను. ఎక్కడైనా జంతువుల తోలుతో చేసిన ఉత్పత్తులను కొని, వాడకండి. ఎందుకంటే మన దేశంలో లెదర్ అనేది ఎక్కువగా వయోజన ఆవుల నుంచి కూడా వస్తుంది. హిందువునైన నేను అలాంటి క్రూరమైన పని ఎప్పటికీ చేయను అంటూ సరైన సమాధానం ఇచ్చింది. దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను బ్యాన్ చేయలేరు. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. నిషేధించడం, దాన్ని మరింత హైలైట్ చేయడం కంటే లెదర్ ని కొనుగోలు చేయకుండా ఉండడమే మంచిదంటూ రష్మీ ట్వీట్ చేసింది.

Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

Yogi Adithyaath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై విరుచుకుపడుతూ.. ఎస్పీ ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోంలా మారిందని అన్నారు. అల్లర్లు జరుగుతున్న క్రమంలో మతాలు, జాతుల వ్యవహారంతో గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయన్నారు.

Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

ఎన్నో వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అల్లర్లు లేని రాష్ట్రంగా మార్చామని చెప్పుకొచ్చాడు. హిందువుల ఇల్లు తగులబడితే ముస్లింల ఇంటికి ఎలా భద్రత ఉంటుందని.. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని సీఎం అన్నారు.

Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి అల్లర్లకు తావు లేకుండా చేశామని యోగి పేర్కొన్నాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అయోధ్య-కాశీ తర్వాత మధుర అనే ప్రశ్నపై సీఎం యోగి మాట్లాడుతూ.. దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశం, భారతీయత గురించి మనం గర్వించగల వాటిలో ఇది ఒక భాగం. దీనిలో మధుర కూడా చేస్తామన్నారు.


ఈ ఎన్నికలో ఎస్పీ కేవలం మూడు సీట్లు మత్రమే ..

అప్పట్లో రామమందిర నిర్మాణంపై తీర్పు వస్తే.. ఇక్కడ అల్లర్లు విపరీతంగా జరిగేవి అని.. రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే రామ మందిర నిర్మాణంలో మనం పురోగతి సాధించామని.. ఈ మార్పును ప్రజలు చూస్తున్నారని అన్నాడు. జాతీయవాదమే మా ఎజెండా అని.. రామ మందిరం సాంస్కృతిక జాతీయవాదంలో భాగం అని అన్నాడు. పుణ్యభూమిని దైవంగా, గొప్పగా మార్చడం మన జాతీయవాదంలో భాగం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఎన్నికలో ఎస్పీ కేవలం మూడు సీట్లు మత్రమే వస్తాయిని.. మిగిలిన 400 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. రాముడు, కృష్ణుడిపై నమ్మకం లేని వారు ఏ నోటి నుంచి నేడు రాముడు, కృష్ణుడు అనే పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించాడు.

Bigg News: మా గ్రామం గుమ్మం తొక్కకండి.. ముస్లింలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు హిందువుల ప్రతిజ్ఞ..!

Bigg News: ముస్లింలను బహిష్కరిస్తున్నామంటూ.. కొందరు వ్యక్తులు ప్రమాణం చేస్తున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. ముస్లింల నుండి ఏమీ కొనబోమని.. వారికి ఏమీ అమ్మబోమని ప్రతిజ్ఞ తీసుకున్నట్లుగా.. వాళ్లు హిందీలో మాట్లాడుతుండటం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Bigg News: మా గ్రామం గుమ్మం తొక్కకండి.. ముస్లింలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు హిందువుల ప్రతిజ్ఞ..!

ఛత్తీస్‌గఢ్ లోని సర్గూజా జిల్లాలోని ఓ గ్రామస్థులు ఈ వీడియోలు ఉన్నారు. ‘‘మేము హిందువులమైన ముస్లిం దుకాణదారుడి నుండి ఏ వస్తువును కొనకూడదని .. వాటిని విక్రయించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ముస్లింలకు మా భూములను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము.

Bigg News: మా గ్రామం గుమ్మం తొక్కకండి.. ముస్లింలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు హిందువుల ప్రతిజ్ఞ..!

ఎవరైనా తమ భూమిని విక్రయించినా, లీజుకు ఇచ్చినా తిరిగి తీసుకుంటాం. వారి కోసం కూలీలుగా పని చేయబోమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, ”అని గ్రామస్థులు తెలిపారు. అంతే కాదు.. తాము తమ మతాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మా గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ గొడవలో ఉన్న హిందూ యువకులు..

సర్గుజా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) అజయ్ కుమార్ యాదవ్ ఈ విషయంపై దర్యాప్తు చేసి.. ఇటువంటి వాటిని ప్రేరేపించిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసు బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ లేదా మత సంస్థ ప్రమేయం లేదని ఆయన తెలిపారు. ఈ నెల ప్రారంభంలో హిందూ , ముస్లిం వర్గాలకు చెందిన అబ్బాయిల గుంపు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో ఆ గొడవలో ఉన్న హిందూ యువకులు తమ గ్రామస్థులను సమావేశపరిచి ప్రమాణం చేయించారని ఐజి యాదవ్ చెప్పారు. ఇక స్థానిక ఎస్పీ, డీఎస్పీలను గ్రామానికి పంపించి.. వాళ్లను శాంతింపచేయిస్తున్నామని.. ఐజి యాదవ్ తెలిపారు. ఇక ఆ వీడియోపై విచారణ ప్రారంభించామన్నారు. జనవరి 6న పోలీసులు వీడియోను పట్టుకుున్నారని.. దానిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ కాంబ్లే తెలిపారు.