Tag Archives: hospitals

Dog: కుక్క పిల్లపై మోజుతో గొడవ పడిన ముగ్గురు యువకులు… చివరికిలా ఆస్పత్రి పాలు!

Dog: కొంతమందికి ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. వాటిని ఇంట్లో మనిషిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అంత కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. వాటికి ఏమైనా బాధ కలిగితే చెప్పడానికి నోరు ఉండదు.. కానీ వాటి హావభావాల ద్వారా కొంతమంది అర్థం చేసుంటారు.

Dog: కుక్క పిల్లపై మోజుతో గొడవ పడిన ముగ్గురు యువకులు… చివరికిలా ఆస్పత్రి పాలు!

ఇక కుక్కకి మనిషికి కూడా లేనంత విశ్వాసం ఉంటుంది అని అంటుంటాం. ఒక్కసారి ఏ కుక్కకైనా అన్నం పెడితే అది చాలా రోజుల వరకు గుర్తు పెట్టుకుంటుందట. ఇక ఇక్కడ జరిగిన ఘటన కుక్క పిల్ల కోసం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Dog: కుక్క పిల్లపై మోజుతో గొడవ పడిన ముగ్గురు యువకులు… చివరికిలా ఆస్పత్రి పాలు!

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. దానిని ప్రతీ రోజు ఇంటి నుంచి పొలానికి తీసుకెళ్తుండేవాడు. దానిని పొలంలోకి కోతులు మరియు మరేదైనా జంతువులు రాకుండా కాపలాగా ఉపయోగించుకునే వాడు.


బాధితుల ఫిర్యాదు మేరకు..

అయితే ఆ కుక్కపిల్లపై అదే గ్రామానికి చెందిన శబరీష్ అనే యువకుడు మోజు పడ్డాడు. ఆ కుక్కపిల్లను కట్టేసింది చూసి.. అక్కడ నుంచి దానిని ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్‌ను మందలించాడు. ఇలా అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తావ్ అంటూ ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది.మాట మాట పెరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ.. కొట్టుకున్నారు కూడా. అంతే కాకుండా ఈ గొడవ అక్కడితో ఆగలేదు. శబరీష్‌ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకొని వెళ్లాడు. మళ్లీ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇలా అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులకు విషయం తెలియడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇలా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం ప్రారంభించారు.

బ్లాక్ ఫంగస్ రోగులకు బెడ్స్ లేవు.. వైద్యం చెయ్యం!

దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా ప్రళయం సృష్టించగా, మరొకవైపు బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరగడంతో నోడల్ కేంద్రమైన కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో 200 పడకలు కేటాయించారు. మరికొన్ని అదనపు పడకలు వేయడంతో ఇప్పటికే 218 మంది ఇందులో చేరారు. సోమవారం ఒక్కరోజు మాత్రమే అత్యవసర చికిత్సా విభాగంలో 31 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు వైద్య అధికారులు తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో పడకలు లేక ఎంతో మంది వెను తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే లైపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి, ఫొసకానజోల్‌, డీఆక్సీ కొలైట్‌ తదితర ఇంజక్షన్లకు కొరత నెలకొంటోంది. అదేవిధంగా ఆస్పత్రిలో పడగల సౌకర్యం లేకపోవడంతో ఎంతో మందికి మందులు రాసిచ్చి ఇంటికి పంపుతున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాపించడంతో నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలు చికిత్సకోసం నగరానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పడకలకు ఇబ్బంది తప్పడం లేదు. 

ఈ విధంగా బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర వైద్య కళాశాల్లోని అనుబంధ ఈఎన్‌టీ విభాగాల్లో బాధితులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు మొదట్లోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తలెత్తదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రజల ఇళ్లు, స్కూల్, హాస్పిటల్ అన్నీ ఒకే భవనంలో.. ఎక్కడంటే?

సాధారణంగా ఒక గ్రామం అంటే చిన్న చిన్న ఇల్లు , స్కూలు, హాస్పిటల్స్ అంటూ ఎన్నో ఉంటాయి.ఈ విధంగా ఒక గ్రామం అంటే ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో అన్ని ఇల్లు మనకు కనిపిస్తాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం అలాంటివి ఏవీ కనిపించవు. గ్రామం మొత్తం ఒకే బిల్డింగ్ లో నివసిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలన్నీ అదే బిల్డింగ్ లో ఉంటాయి. ఇంతకీ ఆ గ్రామం ఏమిటని ఆలోచిస్తున్నారా..ఆ గ్రామం అమెరికాలోని అలస్కాలో ఉంది.

విట్టీర్‌లో గల ఈ అపార్ట్‌మెంట్ సిటీని “బిగిచ్ టవర్స్”అని పిలుస్తారు. ఈ అపార్ట్మెంట్ సముద్ర తీరంలో 14 అంతస్థుల ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ సుమారు నూట తొంభై ఆరు కుటుంబాలు నివసిస్తాయి. ఈ అపార్ట్ మెంట్ లోనే వారికి కావాల్సిన హాస్పిటల్, స్కూల్, నిత్యావసర సరుకులు, పోస్ట్ ఆఫీస్ వంటి తదితర సౌకర్యాలు అన్ని ఉన్నాయి. అందుకే ఈ బిల్లింగ్
ను ‘టౌన్ అండర్ వన్ రూఫ్’ అని అంటారు. వాస్తవానికి ఈ పట్టణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడింది. మిలట్రీ హార్బర్ నిర్మాణం కోసం అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

ఈ 14 అంతస్తుల భవనంలో మూడు విభాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఆ గ్రామ ప్రజలు నివసిస్తే, మిగతా భాగంలో విభాగాల్లో పోస్టాఫీస్, హాస్పిటల్, స్కూల్, జనరల్ స్టోర్, పోలీస్ స్టేషన్, మేయర్ ఆఫీస్ ఉన్నాయి. ఇందులో చిన్న హోటల్, కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంది. భవనాన్ని అనుకొని ప్లే ఏరియా ఇండోర్ పూల్ కూడా ఉంది.

ఈ భవనం పర్వతాలు అనుకునే ఉండడంతో ఇక్కడ వన్యప్రాణుల భయం ఎక్కువగా ఉండటం చేత ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒకే భవనంలో ఉండటం వల్ల వారికి ఎంతో భద్రత ఉందని భావిస్తారు. అమెరికాకు చాలా దూరంగా ఉండటంతో వీరికి కావలసిన కూరగాయలను వీరే స్వయంగా పండించుకుంటారు. వీటి బాధ్యతను అక్కడ ఉన్న పిల్లలు తీసుకుంటారు. పిల్లల క్రీడా మైదానాలు కూడా ఇండోర్ లోనే ఉన్నాయి. ఈ భవనాన్ని చేరుకోవాలంటే ప్రత్యేక కారిడార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా గ్రామ మొత్తం ఒకే భవనంలో నివసించడం ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.