Tag Archives: house doors

ఆ ఇంటి ముందు వాకిలి పంజాబ్ లో ఉంటే..వెనుక వాకిలి హర్యానాలో !

సాధారణంగా కొన్ని కొన్ని విషయాలను గురించి వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పిన ఎవరు నమ్మరు.ఈ విధంగా ఆశ్చర్యకరమైన విషయాలను ఆధారాలతో సహా చూపిస్తే తప్ప నమ్మని పరిస్థితులు తలెత్తుతాయి. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక దేశమైనా, రాష్ట్రమైనా, ఒక ఇంటికైనా సరిహద్దు అనేది తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా సరిహద్దుల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు తలెత్తడం గురించి మనం వినే ఉంటాం. అయితే సరిహద్దు కారణంగా ఓ ఇల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జగవంతి దేవి అనే 70 సంవత్సరాల మహిళ కొంతకాలం క్రితం తన ఇంటిని విస్తరించింది. అయితే తన ఇల్లు సగం పంజాబ్ రాష్ట్రంలో ఉండగా, సగం హర్యానాలోకి వెళ్ళింది. మూడు నెలల క్రితం ఆమె ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె భూమి ఉర్దూలో రిజిస్ట్రీ ఉండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో చేసేదేమీ లేక భూమి రిజిస్ట్రేషన్ పంజాబీలోకి మార్పించారు. ఆ విధంగా మార్చిన ఆమెకు పని జరగకపోవడంతో ఆ భూమి రిజిస్ట్రీ ఆంగ్లంలోకి మార్పించారు. ఇక తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ కోసం ఎలాంటి అభ్యంతరాలు ఉండవని భావించారు.

విద్యుత్ శాఖ అధికారులు జగవంతి దేవి ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి మరోసారి అభ్యంతరం తెలిపారు.తన ఇల్లు రెండు రాష్ట్రాలలో ఉండటం వల్ల ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని, ఆ ఇంటికి సరిహద్దు గోడ నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు తెలియజేయడంతో జగవంతి దేవి చేసేదేమీలేక ఆ ఇంటికి మధ్యలో ఓ అడ్డుగోడను నిర్మించింది.

పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలాంటి సరిహద్దు వివాదాలు ఎన్నో తలెత్తాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలోనే ఆ ఇల్లు కూడా ఇరుక్కుపోయింది. ఈ విధంగా ఇంటికి మధ్యలో అడ్డుగోడ నిర్మించడంతో గోడ కిటికీలో నుంచి ఒకవైపు అత్తగారు మరోవైపు కోడలు ఉండి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.