a-house-on-punjab-haryana-border-sees-partition-for-power-connection
సాధారణంగా కొన్ని కొన్ని విషయాలను గురించి వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పిన ఎవరు నమ్మరు.ఈ విధంగా ఆశ్చర్యకరమైన విషయాలను ఆధారాలతో సహా చూపిస్తే తప్ప నమ్మని పరిస్థితులు తలెత్తుతాయి. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక దేశమైనా, రాష్ట్రమైనా, ఒక ఇంటికైనా సరిహద్దు అనేది తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా సరిహద్దుల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు తలెత్తడం గురించి మనం వినే ఉంటాం. అయితే సరిహద్దు కారణంగా ఓ ఇల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జగవంతి దేవి అనే 70 సంవత్సరాల మహిళ కొంతకాలం క్రితం తన ఇంటిని విస్తరించింది. అయితే తన ఇల్లు సగం పంజాబ్ రాష్ట్రంలో ఉండగా, సగం హర్యానాలోకి వెళ్ళింది. మూడు నెలల క్రితం ఆమె ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె భూమి ఉర్దూలో రిజిస్ట్రీ ఉండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో చేసేదేమీ లేక భూమి రిజిస్ట్రేషన్ పంజాబీలోకి మార్పించారు. ఆ విధంగా మార్చిన ఆమెకు పని జరగకపోవడంతో ఆ భూమి రిజిస్ట్రీ ఆంగ్లంలోకి మార్పించారు. ఇక తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ కోసం ఎలాంటి అభ్యంతరాలు ఉండవని భావించారు.
విద్యుత్ శాఖ అధికారులు జగవంతి దేవి ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి మరోసారి అభ్యంతరం తెలిపారు.తన ఇల్లు రెండు రాష్ట్రాలలో ఉండటం వల్ల ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని, ఆ ఇంటికి సరిహద్దు గోడ నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు తెలియజేయడంతో జగవంతి దేవి చేసేదేమీలేక ఆ ఇంటికి మధ్యలో ఓ అడ్డుగోడను నిర్మించింది.
పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలాంటి సరిహద్దు వివాదాలు ఎన్నో తలెత్తాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలోనే ఆ ఇల్లు కూడా ఇరుక్కుపోయింది. ఈ విధంగా ఇంటికి మధ్యలో అడ్డుగోడ నిర్మించడంతో గోడ కిటికీలో నుంచి ఒకవైపు అత్తగారు మరోవైపు కోడలు ఉండి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…