Tag Archives: income tax websites

మీ పాన్ కార్డు పోగొట్టుకున్నారా… పది నిమిషాల్లో ఇలా డౌన్ లోడ్ చేయండి?

ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు కోసమైనా, బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలుకొని ఏం చేయాలన్నా తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే.ఎంతో అవసరమైన ఈ పాన్ కార్డ్ కొన్ని సార్లు కొందరు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే పాన్ కార్డు పోవడంతో చాలామంది ఎంతో కంగారు పడుతుంటారు.ఈ విధంగా పాన్ కార్డు పోగొట్టుకుపోతే కంగారు పడాల్సిన పని లేదు కేవలం పది నిమిషాలలో పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం…

పాన్ కార్డు పోగొట్టుకున్నవారు కేవలం ఆధార్ కార్డ్ ఉపయోగించి 10 నిమిషాల్లో పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in వెబ్‌సైట్లోకి కాస్త స్క్రోల్ డౌన్ చేస్తే our srvices ఆప్షన్ కనిపిస్తుంది. అందులో వెళ్లి షో మోర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇన్‌స్టంట్ ఈ-పాన్ కనిపిస్తుంది వెంటనే దానిపై మరో క్లిక్ చేయాలి.

ఇదివరకు మీరు ఎప్పుడు పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోకుండా కొత్తగా చేసుకుంటున్నట్లు అయితే అక్కడ
Get New E-PANపై క్లిక్ చేయాలి. లేదు ఇది వరకే మీరు పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉంటే Check Status/Download PAN ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ ఆర్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. అక్కడ ఓటిపి ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డుకు సంబంధించిన వివరాలను స్క్రీన్ పై చూడవచ్చు.

మీ పాన్ కార్డు వివరాలని చూసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మీ మెయిల్ ఐడీకి పాన్ కార్డు వస్తుంది.దీనిని మీరు ఏదైనా ఆధార్ సెంటర్ లేదా నెట్ సెంటర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాన్ కార్డు నెంబర్ గుర్తు ఉండి పాన్ కార్డు పోగొట్టుకున్నట్లు అయితే TIN-NSDL లేదా UTIITSL వెబ్‌సైట్లోకి వెళ్లి కూడా పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.