ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు కోసమైనా, బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలుకొని ఏం చేయాలన్నా తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే.ఎంతో అవసరమైన ఈ పాన్ కార్డ్ కొన్ని సార్లు కొందరు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే పాన్ కార్డు పోవడంతో చాలామంది ఎంతో కంగారు పడుతుంటారు.ఈ విధంగా పాన్ కార్డు పోగొట్టుకుపోతే కంగారు పడాల్సిన పని లేదు కేవలం పది నిమిషాలలో పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి పాన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం…
పాన్ కార్డు పోగొట్టుకున్నవారు కేవలం ఆధార్ కార్డ్ ఉపయోగించి 10 నిమిషాల్లో పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in వెబ్‌సైట్లోకి కాస్త స్క్రోల్ డౌన్ చేస్తే our srvices ఆప్షన్ కనిపిస్తుంది. అందులో వెళ్లి షో మోర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇన్‌స్టంట్ ఈ-పాన్ కనిపిస్తుంది వెంటనే దానిపై మరో క్లిక్ చేయాలి.
ఇదివరకు మీరు ఎప్పుడు పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోకుండా కొత్తగా చేసుకుంటున్నట్లు అయితే అక్కడ
Get New E-PANపై క్లిక్ చేయాలి. లేదు ఇది వరకే మీరు పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉంటే Check Status/Download PAN ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ ఆర్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. అక్కడ ఓటిపి ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డుకు సంబంధించిన వివరాలను స్క్రీన్ పై చూడవచ్చు.
మీ పాన్ కార్డు వివరాలని చూసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మీ మెయిల్ ఐడీకి పాన్ కార్డు వస్తుంది.దీనిని మీరు ఏదైనా ఆధార్ సెంటర్ లేదా నెట్ సెంటర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాన్ కార్డు నెంబర్ గుర్తు ఉండి పాన్ కార్డు పోగొట్టుకున్నట్లు అయితే TIN-NSDL లేదా UTIITSL వెబ్‌సైట్లోకి వెళ్లి కూడా పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…