Featured

హీరోయిన్ చీర కొంగు పట్టుకొని భార్య కు దొరికిపోయిన చిరంజీవి..!? ఆ తర్వాత..

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు ఎక్కడ లేని టెన్షన్ ను తీసుకొస్తాయి. నిజానికి మనం కావాలని ఆ పనులు చేయకపోయినా సరే.. ఎవరు ఏమనుకుంటారో అనే ఇబ్బంది పడతాం..మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఓ సారి ఇలాంటి సంఘటనే జరిగిందట. దాని మూలంగా ఆయన చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడట. తాజాగా సామ్ జూమ్ షోలో పాల్గొన్న చిరంజీవి.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ తను ఎందుకు ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం..

చిరంజీవి పెళ్లికి ముందుకు ఓ అనుకోని ఘటన జరిగింది. శంకరాభరణం సినిమాలో నటించిన మంజు భార్గవి.. చిరంజీవితో కలిసి కోతలరాయుడు సినిమా చేసింది. ఆ పరిచయంతో మంజు భార్గవి శంకరాభరణం ప్రిమియర్ షోకు చిరంజీవిని రావాలని కోరింది. ఆమె ఆహ్వానం మేరకు అల్లు రామలింగయ్య ఫ్యామిలీతో కలిసి ఈ షోకు వెళ్లారు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ అందరినీ ఎంతో బాధ పెడుతుంది. షోలో ఉన్న వాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు. చిరంజీవి కూడా కన్నీళ్లు కార్చాడు. లైట్స్ ఆన్ చేస్తే ఎవరైనా చూస్తారని చిరంజీవి భావించాడు. కన్నీళ్లు తుడుచుకునేందుకు కర్చీఫ్ కోసం వెతికాడు. అయితే దొరకలేదు. పక్కనే ఉన్న మంజు భార్గవి.. తన చీర కొంగు ఇచ్చి తుడుచుకోమని చెప్పింది. సరిగ్గా మంజ చీరకొంగు చిరంజీవి చేతిలో ఉండగా లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పుడే ఈ సీన్ చూసింది సురేఖ.

అప్పటికే చిరంజీవి, సురేఖ పెళ్లి ముచ్చట్లు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మంజు భార్గవి చీర కొంగు తన చేతిలలో ఉండటం చూసి తను ఏమనుకుందో అని టెన్షన్ ఫీలయ్యాడు. ఈ సీన్ జరిగిన కొద్ది రోజులకు సురేఖతో తన వివాహం జరిగింది. అయితే శంకరాభరణం సినిమాలో ప్రీమియర్ షోలో తన చేతిలో ఉన్నమంజు భార్గవి చీర కొంగు సురేఖ చూసి ఈ పెళ్లికి ఒప్పుకోదేమో అనుకున్నాడట. కానీ తను ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడట చిరంజీవి. తాజాగా సమంత షోలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago