Tag Archives: increase immunity

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల జబ్బులను వెంటపెట్టుకొని వస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చాలామంది దగ్గు, జలుబు వంటి అనేక వ్యాధుల బారిన పడతారు.ఈ క్రమంలోనే ఇటువంటి అంటువ్యాధులను తట్టుకొనే శక్తి మన శరీరానికి కావాలంటే తప్పకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి అవసరమవుతుంది.మరి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం..

నారింజ: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో ఒకటైన నారింజ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా విటమిన్ సి లభ్యమవుతుంది. విటమిన్-సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.

పెరుగు: వర్షాకాలం వేసవి కాలలతో మనకి సంబంధం లేకుండా ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి.ఈ బాక్టీరియాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పూర్తిస్థాయిలో దోహదపడతాయి.

పుట్టగొడుగులు: ఎన్నో పోషక విలువలకు నిలయమైన పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల అనేక పోషక విలువలు శరీరానికి అందుతాయి. పుట్టగొడుగులలో ముఖ్యంగా ప్రొటీన్లు, ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన శరీర బరువును నియంత్రించడానికి ఇది దోహద పడతాయి.

పుచ్చకాయ: పుచ్చకాయలు ఎక్కువగా వేసవిలో మనకు విరివిగా లభిస్తాయి. ఈ విధంగా పుచ్చకాయలను అధిక భాగంలో తీసుకోవడం వల్ల వీటిలో గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. ఇవే కాకుండా బ్రోకలీ,తాజాపండ్లు, ఆకుకూరలు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసి వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను తరిమికొట్టొచ్చు.

పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..!!

సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు నిత్యం జబ్బుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలం, శీతాకాలంలో పిల్లలను జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు ప్రతిరోజూ ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే తక్కువగా రోగాల బారిన పడతారు. పిల్లలకు ప్రతిరోజూ క్యారెట్లను తినిపించాలి. క్యారెట్ల ద్వారా విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభిస్తాయి.

బాదం, పిస్తాపప్పు, జీడిపప్పు, నట్స్ ఇమ్యూనిటీని పెంచి పిల్లలు బలంగా తయారయ్యేలా చేస్తాయి. జీడిపప్పు, పిస్తాపప్పు రోజూ తినే పిల్లలకు సంపూర్ణ పోషణ లభించడంతో పాటు వాళ్లు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. నిమ్మ జాతికి చెందిన పండ్లు సైతం పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. చిన్నారులు వారంలో ఒకసారైనా నారింజ, బత్తాయి లాంటి పండ్లను తీసుకోవాలి.

ఈ పండ్ల ద్వారా పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో వాళ్లు జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పిల్లలకు ఖచ్చితంగా తినిపించాల్సిన ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో పెరుగు సహాయపడుతుంది.

పిల్లలకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కంగా ఉండే ఆహారాన్ని అందించాలి. ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్ లను బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడంతో పాటు లంచ్ లో చపాతీ లేదా అన్నం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పల్లీలు, గుడ్లు, అరటిపండ్లు కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.