Tag Archives: indelible mark

Super Star Krishna: నిర్మాతల హీరోగా చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ.. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను పరిచయం చేసిన కృష్ణ!

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్రపరిషంలో చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో సాహస ప్రయోగాత్మక సినిమాలలో నటించి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూడచారి 116,తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు వంటి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణకు చెల్లింది.

వీటితో పాటు తెలుగు ఫుల్ స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం వంటి సూపర్ హిట్ సాహస ప్రయోగాత్మక సినిమాలన్నీ కూడా కృష్ణ గారు నటించినవే. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలలో ప్రసారమైనప్పటికీ ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను 50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించి అప్పట్లోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా రోజుకు మూడు షిఫ్టులలో ఏడాదికి పది సినిమాలు చొప్పున విడుదల చేస్తున్న ఘనత హీరో కృష్ణకు మాత్రమే చెల్లింది.1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. ఒకే ఏడాదిలో కృష్ణ ఏకంగా 17 సినిమాలలో నటించి విడుదల చేశారంటే ఈయన సినిమాల కోసం ఎంతలా కష్టపడేవారో అర్థమవుతుంది.1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలను విడుదల చేసి అద్భుతమైన రికార్డు సాధించిన ఏకైక ఘనత కృష్ణ గారు సొంతం చేసుకున్నారు.

Super Star Krishna: అద్భుతమైన రికార్డులు సృష్టించిన కృష్ణ…

ఈ విధంగా చిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు అందించిన కృష్ణ తన సినిమా వల్ల ఎవరైనా నిర్మాత నష్టపోయారు అంటే వెంటనే వారిని పిలిచి డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదంటే తనకోసం మరొక సినిమా కథ సిద్ధం చేసుకోమని తాను ఫ్రీగా సినిమాలలో నటిస్తానని భరోసా ఇచ్చేవారు.ఇలా తన వల్ల ఎప్పుడూ నిర్మాతలు నష్టపోయిన దాఖలాలు లేవు అందుకే కృష్ణ గారిని నిర్మాతల హీరో అని పిలిచేవారు. ఇలాంటి ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి కృష్ణ నేడు తుది శ్వాస విడవడంతో ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని,ఈయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు.