Tag Archives: Indian marriage

అబ్బాయి మెడలోను తాళి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

సాధారణంగా మన భారతదేశంలో పెళ్లైన స్త్రీలు మాత్రమే మెడలో తాళిని ధరిస్తారు. కానీ ఆ తాళిని మగవారు ధరించడం మీరు ఎప్పుడైనా చూసారా.ఏంటి తాళి మగవాళ్ళు ధరించడం అంటే అందరికీ మన తెలుగు సినిమా జంబలకడిపంబ గుర్తుకొస్తుంది. ఈ విధంగా సినిమాలలో మగవారు తాళిని వేసుకోవడం చూసాము కానీ నిజజీవితంలో ఆడవారు మాత్రమే తాళిని ధరిస్తారు.కానీ పుణేకు చెందిన ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా వరుడు కూడా తాళిని ధరించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

పుణేకు చెందిన ఓ జంటకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం జరిగింది. కాలేజీ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఇద్దరు ప్రేమించుకున్న ఈ జంట మహారాష్ట్ర పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి మంగళ సూత్రం ధరించినప్పుడు తాను కూడా మంగళ సూత్రం ధరించడంలో ఏ మాత్రం తప్పులేదని భావించిన వరుడు తన మెడలో కూడా మంగళసూత్రం ధరించాడు.

ఈ విధంగా అమ్మాయి చేత తాళి కట్టించుకొన్న అబ్బాయి తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అబ్బాయిల పరువు మర్యాదను తుంగలో తొక్కారని కొందరు భావించగా, మరికొందరు పాపులర్ కావడానికి ఈ విధంగా చేశాడని భావించారు. కానీ ఈ మాటలన్నీ ఆ యువకుడు మాత్రం పట్టించుకోలేదు.

ఈ సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం అయినప్పుడు అమ్మాయిలు ధరించే తాళి అబ్బాయిలు ఎందుకు ధరించకూడదని వాదించాడు. అమ్మాయిలు భర్త క్షేమం కోసం తాళి ధరించినప్పుడు, భార్య క్షేమం కోసం భర్త తాళి ధరిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. ఏదిఏమైనా ఈ జంట ఇద్దరు తాళి ధరించడం పట్ల కొందరు సానుకూలంగా ప్రవర్తిస్తే మరి కొందరు భావిస్తున్నారు.