Tag Archives: indra

Indra : మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్.. ఈ ఒక్క సీన్ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టింది.!!

Indra : 2002 వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “ఇంద్ర” సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా నటించారు. సినిమా కథని సంక్షిప్తంగా వివరిస్తే..

ట్యాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ (చిరంజీవి) కాశీలో గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక ముత్యాల హారం దొరుకుతుంది. కాశీలో తన కూతురు పల్లవి (సోనాలి బేంద్రే)కి సంగీతం నేర్పించాలని గవర్నరు చెన్న కేశవ రెడ్డి (ప్రకాశ్ రాజ్)తన కుటుంబంతో సహా గంగలో మునకలు వేస్తుండగా పల్లవి మెడలోంచి జారిన హారమే అది. శంకర్ మేనకోడలు నందిని క్లాస్ మేట్ గా పల్లవి చేరుతుంది. తన మామ మెడలో హారాన్ని చూసిన పల్లవి వారి ఇంటిలోనే ఉంటూ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కాలేజీ హాస్టల్ లో కాక ఒక ట్యాక్సీ డ్రైవర్ ఇంటిలో తన కూతురు ఉంటుందని తెలుసుకొన్న చెన్న కేశవ రెడ్డి భద్రతా సిబ్బందితో సహా శంకర్ ఇంటిని చుట్టుముడతారు. శంకర్ ని చూసిన చెన్న కేశవ రెడ్డి చేతులెత్తి అతనికి నమస్కరిస్తాడు.

లాంచీ డ్రైవర్ అయిన గిరి (శివాజీ) నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి వివాహం జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి (ఆర్తి అగర్వాల్) మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని తనే స్వయంగా పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్. మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి (తనికెళ్ళ భరణి)నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది. అయితే ఓ సన్నివేశం సినిమాకి హైలెట్ గా నిలిచింది. శంకర్ నారాయణ(చిరంజీవి) మేనల్లుడు, షౌఖత్ ఆలీ ఖాన్ కూతురిని ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న షౌకత్ అలీఖాన్, శంకర్ నారాయణ మేనల్లుడిని(ప్రదీప్) ఓ కొయ్యకు కట్టేసి నిలదీస్తున్న క్రమంలో.. శంకర్ నారాయణ(చిరంజీవి) అక్కడికి చేరుకుంటాడు.

హిందువులు స్త్రీలను గౌరవిస్తారని తెలుసు అంటూ.. ఖాన్ చెప్పగానే ముంతాజ్ వచ్చి తనే నా వెంబడి పడుతున్నాడని తండ్రికి భయపడి శంకర్ నారాయణ(చిరంజీవి) మేనల్లుడి(ప్రదీప్)పై ఆరోపణలు చేస్తుంది. ఓ విద్యార్థి తప్పుచేస్తే గురువుది తప్పు.. ఓ పిల్లవాడు తప్పు చేస్తే అతని సరిగ్గా పెంచని తండ్రిది తప్పు.. నా మేనల్లుడుకి తల్లి అయిన తండ్రి అయిన నేనే.. కావున నన్ను శిక్షించండని శంకర్ నారాయణ(చిరంజీవి) అడ్డుగా పోయి కొరడా దెబ్బలు తింటాడు. “తప్పు నా వైపు ఉందని తలవంచుకుని వెలుతున్నాను. లేకుంటే తలలు తీసుకువెళ్లేవాడినని” చెప్తూనే.. తన మేనల్లుడిని తీసుకుని శంకర్ నారాయణ ఇంటికి వెలతాడు.

అంతలోనే ముంతాజ్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. తన తప్పు తెలుసుకొని ఖాన్.. శంకర్ నారాయణ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరతాడు. కూతురు ముంతాజ్ ను శంకర్ నారాయణ మేనల్లుడితో పెళ్లి చేయడానికి షౌఖత్ ఆలీ ఖాన్ ఒప్పుకుంటాడు. ఈ సీన్ ఇంద్ర సినిమాలో హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. మెగాస్టార్ తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలాంటి సన్నివేశంతో వచ్చిన ఇంద్ర సినిమా 2002 సంవత్సరానికి గాను ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఏడ్చేసిన సుధీర్.. తను నెల నెలా డబ్బులు పంపుతానన్న ఇంద్రజ..!

ఇటీవల విడుదలైన శ్రీదేవీ డ్రామాకంపెనీ ప్రోమో అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంది. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నంలో భాగంగా వృద్ధాశ్రమంలో ఉంటున్న వారిని ఈ షోకు తీసుకొచ్చారు. అందులో వాళ్లల్లో కాస్త నవ్వులు పూయించేందుకు ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ఆది ఓ బామ్మతో వేసిన డ్యాన్స్.. వాళ్లతో లవ్ చేస్తున్నా అంటూ చెప్పిన కామెడీ.. అందరిలోనూ ఆనందం నింపాయి. ఇక ఆదికి పెయిర్ దొరికినట్లే అని కామెడీ చేస్తే అలరించారు. అందులో ఓ పెద్దావిడ పాడిన పాటకు.. సుధీర్ భావోద్వేగానికి గురయ్యాడు.

‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి’ అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవడంతో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అమ్మ విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సుధీర్‌. ఇక్కడ ఉన్న తల్లిదండ్రలు ఇంత బాధ అనుభవిస్తుంటే.. మీతో పాటు వాళ్లను కూడా తీసుకెళ్లొచ్చు కదా.. అంటూ వీరిని ఆశ్రమంలో వదిలేసిన వారిని కోరాడు సుధీర్.

ఇక ఇదే వేధికపై వాళ్ల బాధను చూడలేక.. వర్ష, భాను రూ.లక్ష విరాళం అందజేశారు. అంతే కాకుండా ఇంద్రజ కూడా వాళ్ల మెడికల్ కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంతో కనుక్కొని.. ఒక్క వారం కాదు.. ప్రతీ నెలా తానే భరిస్తానని.. ఆ ఖర్చులకు డబ్బులు నేనే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రోమో ప్రతీ ఒక్కరి హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఈ ప్రోగ్రాం పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 3 న విడుదల కానుంది.