Tag Archives: instant enery

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా..?

చాలామంది చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని చెబుతూ ఉంటారు. అయితే అలా వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. వేసవికాలంతో పాటు చలికాలంలో కూడా కొబ్బరినీళ్లను తాగవచ్చు. కొబ్బరి నీళ్లను తాగితే తక్షణమే శక్తి వస్తుంది. సెలైన్ బాటిల్ వల్ల శరీరానికి ఏ స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కొబ్బరి బోండాం నీళ్లు కూడా అదే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

చాలామంది తరచూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే కొబ్బరినీళ్లు కూల్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం చేకూరదు. తరచూ నోరు పొడిబారుతున్నా, అలసిపోయినా కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. నడుము చుట్టూ కొవ్వు సమస్యతో బాధ పడేవాళ్లకు ఆ కొవ్వును కరిగించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.

కొబ్బరి నీళ్లు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధ పడేవాళ్లు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు డైట్ లో కొబ్బరినీళ్లను భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. కొబ్బరి నీళ్లు గుండె సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడే వాళ్లకు కొబ్బరి నీళ్లు ఆ సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. తల తిరగడం, కడుపులో గడబిడ సమస్యల్ను సైతం కొబ్బరినీళ్లు దూరం చేస్తాయి. వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగితే నీరసం సమస్య తగ్గుముఖం పడుతుంది.