Tag Archives: insult

తారక్ చేసిన పనికి.. “పని పాట లేకుండా వస్తారు..” అంటూ రాజమౌళి నన్ను తిట్టాడు.. : రాజీవ్ కనకాల

సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వీరి మధ్య చాలా అనుబంధం ఉంది.ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో కచ్చితంగా రాజీవ్ కనకాల ఉండేలా చూసుకుంటారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం రాజు కనకాలకు సినిమా అవకాశాలు తక్కువగానే వస్తున్నాయని చెప్పవచ్చు.రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటికి రాజమౌళి, ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య మంచి స్నేహబంధం ఉండేది.ఈ విధంగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక బైక్ ఇన్సిడెంట్ వల్ల రాజమౌళి సెట్ లో అందరి ముందు రాజీవ్ కనకాల దారుణంగా అవమానించారు. అయితే ఆ రోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ కి చర్లపల్లి జైలులో షూటింగ్ ఉంది.ఈ క్రమంలోనే తనకు షూటింగ్ లేకపోవడం వల్ల ఇంట్లో పడుకున్నానని ఆ టైంలో తారక్ ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడగగా ఇంట్లోనే ఉన్నానని చెప్పానని అందుకు తారక్ నాకు ఈ రోజు షూటింగ్ లేదు, చాలా బోర్ కొడుతుంది కాసేపు అలా బయటికి వెళ్దాం నేను కిందే ఉన్నాను వచ్చే అన్నారు.

అదేంటి షూటింగ్ లేకపోవడం అనుకుంటూనే బయలుదేరి వెళ్లాను. అయితే బయట సరదాగా తిరుగుదామని చెప్పిన తారక సినిమా షూటింగ్ లొకేషన్ కి తీసుకువెళ్లారు. అదేంటి షూటింగ్ లేదన్నారు కదా ఇలా తీసుకెళ్తున్నారు ఏంటి అని అడగగా ఊరికే అబద్ధం చెప్పానని బండి పై షూటింగ్ లోకేషన్ కు తీసుకువెళ్లారు. ఈ విధంగా షూటింగ్ లొకేషన్ లో నన్ను చూడగానే జక్కన్న అంత ఎత్తుకు ఎగిరి పడ్డాడు. నీకు షూటింగ్ లేదు కదా అయినా ఎందుకు వచ్చావు. తారక్ ను డిస్టర్బ్ చేయడానికి వచ్చావా అంటూ తనని కోపడ్డారని అక్కడికి తారక్ తీసుకువచ్చారని చెబుతున్నా వినకుండా జక్కన్న అలా మాట్లాడాలని రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

అయితే అతను తిట్టింది చాలా సీరియస్ గా కాదని మా మధ్య బాగా చనువు ఉండటం వల్ల ఆ విధంగా అన్నారని రాజీవ్ చెప్పారు. అచ్చం నాకు జరిగినట్లుగానే రాజమౌళి తారక్ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు నన్ను కూడా ఇలాగే తీసుకువచ్చారని రాజీవ్ కనకాల అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలియజేశారు.