Tag Archives: israel vaccination

ఆ దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న వారికి గుండెల్లో మంట.. ఎందుకంటే?

ప్రస్తుతం కరోనా మహమ్మారిను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్ 19న ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఏప్రిల్ 20 నాటికి 65 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది.

ఇజ్రాయిల్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తున్నారు. ఈ టీకా వేయించుకోవడం వల్ల పలువురి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తడంతో ఈ కేసులపై ఇజ్రాయిల్ ఆరోగ్య అధికారులు పరిశోధనలు జరిపినట్లు కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు.

టీకా వేసుకున్న వారిలో దాదాపు 62 మందిలో ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తాయని, తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు.30 సంవత్సరాలు ఉన్న వారిలో ప్రతి 20 వేల మందిలో ఒకరికి ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇద్దరు మృత్యువాత పడినట్లు తెలిపారు.

టీకా ప్రయోజనం చాలా గొప్పదిగా కనిపిస్తోంది. కొన్ని కేసులలో టీకాతో సంబంధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సమర్ధనీయం కాదు’’ అని యాష్ తెలిపారు. ఇదే విషయం గురించి ఫైజర్ కంపెనీకు సమాచారం అందించగా వారు ఈ విషయంపై స్పందించి వ్యాక్సిన్ వల్ల కండరాలు నొప్పులు రావడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.

ఫైజర్ టీకా వల్ల సాధారణ జనాభాలో ఊహించిన దానికంటే ఎక్కువగా మయోకార్డియల్ రేటును గమనించలేదు. వ్యాక్సిన్ కు మయోకార్డియల్ రేటుకు ఏమాత్రం సంబంధం లేదని,వ్యాక్సిన్ వల్లే ఈ విధమైనటువంటి సమస్య ఏర్పడిందని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవని ఫైజర్ పేర్కొంది.