ప్రస్తుతం కరోనా మహమ్మారిను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్ 19న ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఏప్రిల్ 20 నాటికి 65 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది.
ఇజ్రాయిల్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తున్నారు. ఈ టీకా వేయించుకోవడం వల్ల పలువురి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తడంతో ఈ కేసులపై ఇజ్రాయిల్ ఆరోగ్య అధికారులు పరిశోధనలు జరిపినట్లు కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు.
టీకా వేసుకున్న వారిలో దాదాపు 62 మందిలో ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తాయని, తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు.30 సంవత్సరాలు ఉన్న వారిలో ప్రతి 20 వేల మందిలో ఒకరికి ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇద్దరు మృత్యువాత పడినట్లు తెలిపారు.
టీకా ప్రయోజనం చాలా గొప్పదిగా కనిపిస్తోంది. కొన్ని కేసులలో టీకాతో సంబంధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సమర్ధనీయం కాదు’’ అని యాష్ తెలిపారు. ఇదే విషయం గురించి ఫైజర్ కంపెనీకు సమాచారం అందించగా వారు ఈ విషయంపై స్పందించి వ్యాక్సిన్ వల్ల కండరాలు నొప్పులు రావడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
ఫైజర్ టీకా వల్ల సాధారణ జనాభాలో ఊహించిన దానికంటే ఎక్కువగా మయోకార్డియల్ రేటును గమనించలేదు. వ్యాక్సిన్ కు మయోకార్డియల్ రేటుకు ఏమాత్రం సంబంధం లేదని,వ్యాక్సిన్ వల్లే ఈ విధమైనటువంటి సమస్య ఏర్పడిందని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవని ఫైజర్ పేర్కొంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…