Tag Archives: IT Raids

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో దాచిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

Viral Video: అక్రమంగా సంపాదించే వారికి ఎవరికైనా భయపడకపోచ్చు కానీ.. ఇన్ కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మాత్రం ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. పన్నులను ఎగ్గొట్టి.. డబ్బులను అక్రమంగా ఇంట్లోనే దాచుకుంటారు. ఇలా వాళ్లు ఆ డబ్బులను సినిమాల్లో చూపించిన విధంగా.. మనం ఊహించని ప్రదేశంలో దాచుకుంటారు.

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

తాజాగా ఓ కుటుంబంపై రైడ్ నిర్వహించిన అధికారులు.. ఆ కుటుంబసభ్యులు ఆ డబ్బులను దాచిన ప్రదేశం కనుకున్న అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలోని వ్యాపారవేత్త శంకర్ రాయ్, అతని కుటుంబంపై దాడులు నిర్వహించారు ఇన్ కంట్యాక్స్ అధికారులు.

Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!

వాళ్లు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఆ డబ్బులలో కోటి వరకు అండర్ గ్రౌండ్ వాటర్ (సంపు) లో దాచిన బ్యాగులో దొరికింది. ప్రస్తుతం ఆ డబ్బులను ఆరపెడుతున్నట్లు తెలిపారు. వాటిని ఇస్త్రీ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు.


రూ. 10 వేల రివార్డును ప్రకటించిన అధికారులు..

నగదుతో పాటు సుమారు రూ.5 కోట్ల విలువైన నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు మూడు కిలోల బంగారాన్ని కూడా జప్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ తెలిపారు. ఈ విషయాన్ని సోదాలకు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ వెల్లడించారు. ఈ దాడి దాదాపు 39 గంటల పాటు కొనసాగింది. మిస్టర్ రాయ్ కుటుంబం ఉద్యోగుల పేరుతో 36 బస్సులను నడుపుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ రాయ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గురించి మరింత సమాచారం ఎవరైనా ఇస్తే వారికి రూ. 10 వేలు రివార్డును ఇస్తామని డిపార్ట్‌మెంట్ ప్రకటించింది . దీనిపై జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ.. రాయ్ కుటుంబానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నామని తెలిపాడు. ఈ విచారణ తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.