Tag Archives: jaggery

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

Sammakka-Sarakka: గిరిజన కుంభమేళా… మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్దం అయింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోట్ల మంది ప్రజలు వస్తుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల మొదలై నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

పెద్ద ఎత్తున నిర్వహించే ఈ జాతరను 1996లో రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ జాతీయపండగగా సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తించాలని డిమాండ్ చేస్తోంది.  మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఓడిషా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈసారి కూడా మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?

ఇదిలా ఉంటే పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో ఈ మేడారం జాతర సాగుతుంది. అక్కడి నియమ నిబంధనలు కొందరికి కొత్తగా అనిపించ వచ్చు. ముఖ్యంగా బెల్లాన్ని బంగారంగా తల్లులకు సమర్పించడం చాలా మందికి వింతగా తోస్తుంది. 


సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులో..

బెల్లాన్ని బంగారంగా తల్లులకు ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతర మొదలైనప్పుడు కేవలం గిరిజన జాతరగానే ఉండేది. అయితే తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రారంభించారు. గిరిజనులకు బెల్లం, ఉప్పు వేరే ప్రాంతాల నుంచి వస్తాయి. దీంతో వీటిని గిరిజనులు అపురూపంగా చూసుకుంటారు. కాలక్రమంలో ఈ బెల్లాన్నే సమ్మక్క-సారలమ్మలకు నైవేధ్యంగా సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కథ కూడా ఉంది. సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులో పగిడిద్ద అంటే బంగారం అని..  దీంతో బెల్లాన్ని బంగారం అని పిలుస్తున్నారని అంటుంటారు. తమ కోరికలు నెరవేరిన వారు వారి బరువు ఉన్నంతగా బంగారాన్ని కొలిచి తల్లులకు సమర్పిస్తారు. పిల్లలు పుట్టాలని మొక్కుకునేవారు, లేకపోతే కోరిక తీరిన తరువాత బంగారాన్ని అమ్మవార్లకు నైవేధ్యంగా ఇస్తారు. పిల్లలకు జాబ్ వచ్చినా.. లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు తీరినా.. అనుకున్నట్లు కోరికలు నెరవేరినా.. తల్లులకు మొక్కకున్న విధంగా బెల్లాన్ని వారి ఎత్తు జోకించి నైవేధ్యంగా సమర్పిస్తారు.