Tag Archives: jayamma panchayitee

Suma Kanakala: జయమ్మ పంచాయతీ కోసం సుమ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Suma Kanakala: సుమ కనకాల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ప్రతి ఒక్కరికీ ఎంతో సుపరిచితమైన సుమ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా ఈవెంట్లు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉండే సుమ ఒక రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Suma Kanakala: జయమ్మ పంచాయతీ కోసం సుమ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఇలా పలు సినిమా ఈవెంట్స్ ద్వారా బుల్లి తెర పై ఎంతో బిజీగా ఉండే సుమ ఇక పై వెండితెర పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. సుమ ఇదివరకే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినప్పటికీ ప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు.

Suma Kanakala: జయమ్మ పంచాయతీ కోసం సుమ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

విజయ్‌ కుమార్‌ కలివారపు దర్శకత్వంలో సుమ లీడ్ రోల్ పోషిస్తున్న జయమ్మ పంచాయతీ అనే చిత్రాన్ని  బలగ ప్రకాశ్‌ నిర్మించారు. ఈ సినిమాకు గానూ సుమ ఓ రేంజ్లో పారితోషకం తీసుకున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏమాత్రం వెనకడుగు వేయని నిర్మాతలు….

ఒకరోజు కాల్షీట్స్ ఇస్తే సుమారు లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేసే సుమ జయమ్మ పంచాయతీ సినిమా కోసం ఏకంగా 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.సుమ ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడంతో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు సైతం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. బుల్లి తెరపై తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ వెండితెరపై జయమ్మగా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

Anchor Suma : యాంకర్ “సుమ” దాసరి దర్శకత్వంలో హీరోయిన్ గా నటించారని మీకు తెలుసా.?

గలగల మాట్లాడే పక్కింటి అమ్మాయిలా బుల్లి తెర పై సందడి చేసే యాంకర్ ఎవరో మనకు బాగా తెలుసు. 1974 కేరళ లో పుట్టిన సుమ తన తండ్రి బదిలీ రీత్యా సికింద్రాబాద్ కు రావడం జరిగింది. తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి విమల ఎప్పటినుంచో సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు. తన మాతృభాష “కేరళ” అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలరు. దేవదాస్ కనకాల దర్శకత్వంలో “మేఘమాల” సీరియల్ చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

అలా 1999 ఫిబ్రవరి 10న రాజీవ్ కనకాల, సుమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. స్థానికంగా సికింద్రాబాద్ లో నివాసం ఉండటంతో ఆమెకు సహజంగా తెలుగుపై ఆసక్తి పెరుగింది. అలాగే ఆమె చదువుకుంటున్న రోజుల్లో తెలుగును కూడా ఒక సబ్జెక్టు గా తీసుకోవడం వలన తెలుగు భాషపై మరింత పట్టు‌ దొరికేలా ఆమెకు తోడ్పడింది. వీరికి ఒక పాప,బాబు జన్మించారు. అయితే.. సుమ దర్శకరత్న దాసరి దర్శకత్వంలో హీరోయిన్ గా నటించారు. 1996 డిసెంబర్ 12న, ఎస్.మల్లేష్ నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కళ్యాణ ప్రాప్తిరస్తు” సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో వక్కంతం వంశీ, సుమ కనకాల, కావ్య హీరోహీరోయిన్లుగా నటించారు. కోటి అందించిన స్వరాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

ఒరే..రిక్షా సినిమా తర్వాత దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత పవిత్రప్రేమ, వర్షం, ఢీ, బాదుషా, స్వయంవరం, రావోయి చందమామ లాంటి చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. వెండితెర కంటే బుల్లితెర పైనే యాంకర్ సుమ కి మంచి పేరు వచ్చింది.వేయి పడగలు, మేఘమాల, అన్వేషిత, మందాకిని, జీవనరాగం, ఆరాధన లాంటి ధారావాహికాలలో సుమ నటించారు. అదేవిధంగా లక్కుకిక్కు, పట్టుకుంటే పట్టుచీర, స్టార్ మహిళ, అవాక్కయ్యారా, పంచావతారం, భలే చాన్సులే లాంటి టీవీ కార్యక్రమాలతోపాటు ప్రస్తుతం క్యాష్ అనే ఈటీవీ కార్యక్రమంలో ప్రతి శనివారం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.

ఉత్తమ టీవీ యాంకర్స్ కోసం నిర్వహించిన “లిమ్కా F.F హంట్” కార్యక్రమంలో సుమ విజేతగా నిలిచారు. అలాగే పంచావతారం కార్యక్రమానికి ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి ఉత్తమ యాంకర్ గా లోకల్ టీవీ మీడియా పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.నేటి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు అన్నిటికీ సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.